వాణిజ్య పన్నుల శాఖ వద్దేవద్దు
వాణిజ్య పన్నుల శాఖ మంత్రి పదవికి అర్హులైన వారు ఎంతో మంది మంత్రివర్గంలో ఉన్నారని రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. అలాంటి వారి ఆ శాఖ అప్పగిస్తే బాగుండేదని ఆయన పేర్కొన్నారు. బుధవారం శ్రీధర్ బాబు హైదరాబాద్లో విలేకర్లతో మాట్లాడారు. సీఎం కిరణ్కు మంత్రిత్వ శాఖలను మర్చే అధికారం ఉందని అభిప్రాయపడ్డారు. తనకు వాణిజ్య పన్నుల శాఖ వద్దే వద్దని శ్రీధర్ బాబు తెగేసి చెప్పారు.
శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబును వాణిజ్య పన్నుల శాఖ బాధ్యలు అప్పగిస్తు సీఎం కిరణ్ నిర్ణయం తీసుకున్నారు. అయితే శాసనసభ వ్యవహరాల శాఖ బాధ్యతలను మంత్రి ఎస్. శైలజానాథ్కు అప్పగించారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చిన సమయంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన శ్రీధర్ బాబు శాసన సభ వ్యవహరాల బాధ్యతల నుంచి తప్పించడం పట్ల ఆ ప్రాంతానికి చెందిన మంత్రులు ఆగ్రహంగా ఉన్నారు. అధికాక సమైక్య ఉద్యమంలో శైలజానాథ్ కీలక భూమిక పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు సీఎం కిరణ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే సహచర మంత్రులతో చర్చించి తర్వాత తన భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని శ్రీధర్ బాబు ఈ సందర్భంగా వెల్లడించారు.