తెలుగు అంటే చాలా ఇష్టం: సివిల్స్ ర్యాంకర్
హైదరాబాద్: తెలుగు అంటే తనకు ఎంతో ఇష్టమని, తెలుగులోనే పరీక్ష రాశానని సివిల్స్ ఆలిండియా మూడో ర్యాంకర్ రోణంకి గోపాలకృష్ణ తెలిపారు. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతుంటే స్నేహితులు, గురువులు అవమానించారని వాపోయారు. దూరవిద్యలో డిగ్రీ చేసి సివిల్స్‌కు ప్రిపరేషన్ అంటే ఎవరెస్టు అధిరోహించడమే అంటూ నిరుత్సాహపరిచారని అన్నారు. గురువారం ‘సాక్షి’ టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.
తన కుటుంబం ఎంతగానో ప్రోత్సహించిందన్నారు. గ్రామీణ వాతావరణం, అణగారిన వర్గాల పరిస్థితుల కారణంగా సివిల్స్ వైపు వెళ్లానని వెల్లడించారు. ‘మా గ్రామం నుంచి మమ్మల్సి వెలివేయడం నాకు మరింత కసిని పెంచింద’ని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పారసంబ గ్రామానికి చెందిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) బుధవారం రాత్రి ప్రకటించిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామి నేషన్–2016 ఫలితాల్లో మూడో ర్యాంకు సాధించారు.