civils 3rd ranker
-
ఈ ర్యాంకుకు జనరల్ కేటగిరీలో ఐఏఎస్‌కు ఎంపిక కానని తెలుసు...
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర) : మొదటి రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయినా ప్రయత్నం ఆపలేదు. ఆత్మవిశ్వాసం సడలలేదు. అదే విశ్వాసంతో, సాధించాలనే పట్టుదలతో మూడో ప్రయత్నం కొనసాగించి, సివిల్స్‌లో 315 ర్యాంకు సాధించింది. ఆమె మరెవరో కాదు. నగరానికి చెందిన నౌపడ ఆశ్రిత. విశాఖపట్నంలో సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఆశ్రిత ప్రాథమిక విద్యాభ్యాసం నగరంలోని రైల్వేన్యూకాలనీలో ఉన్న హరగోపాల్ స్కూల్లో జరిగింది. అనంతరం నారాయణ కళాశాలలో ఇంటర్ బైపీసీ చదివింది. తరువాత ఆదిత్య డిగ్రీ కాలేజీ నుండి డిగ్రీ పూర్తి చేసింది. 2019లో ప్రైవేట్ ఉద్యోగంలో చేరింది. అక్కడి నుంచి సివిల్స్ ర్యాంక్ సాధన వరకు తన ప్రయాణాన్ని సాక్షికి ఆశ్రిత తెలిపింది. ఆమె మాటల్లోనే.. ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నపుడే సోషల్ వర్క్ పట్ల ఆసక్తి పెరిగింది. సివిల్స్ కోచింగ్ కోసం ఢిల్లీకి వెళ్లా. కోవిడ్ కారణంగా కోచింగ్ మధ్యలోనే ఆగిపోయింది. తిరిగి ఇంటికి చేరుకున్నా. ఇంటి దగ్గరే చదివి, రెండు సార్లు సివిల్స్ రాశాను. కానీ ప్రిలిమ్స్ కూడా అర్హత సాధించలేకపోయా. ఈసారి పట్టుదల పెరిగింది. మరోసారి రాసేందుకు కోచింగ్ తీసుకున్నా. 2022లో సివిల్స్ మూడో అటెంప్ట్ చేశా. తాజాగా విడుదలైన ఫలితాల్లో 315వ ర్యాంకు వచ్చింది. ఈ ర్యాంకుకు జనరల్ కేటగిరీలో ఐఏఎస్‌కు ఎంపిక కానని తెలుసు. అందుకే మరోసారి ర్యాంకు మెరుగుగైన ర్యాంకు కోసం 28న జరిగే ప్రిలిమ్స్‌కు హాజరుకానున్నట్టు ఆశ్రిత పేర్కొంది. తండ్రి ప్రైవేట్ ఉద్యోగి, తల్లి గృహిణి. తల్లితండ్రుల ప్రోత్సాహం, పక్కా ప్రణాళిక, అధ్యాపకులు శిక్షణ తననీ స్థాయికి తీసుకొచ్చాయని తెలిపింది. -
కోచింగ్ సెంటర్లపై గోపాలకృష్ణ మండిపాటు
హైదరాబాద్: కోచింగ్ సెంటర్ల వ్యవహారశైలిపై సివిల్స్ ఆలిండియా మూడో ర్యాంకర్ రోణంకి గోపాలకృష్ణ మండిపడ్డారు. కోచింగ్ సెంటర్లు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దంటూ నిరుద్యోగులను సలహా ఇచ్చారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నేను ఎక్కడా కోచింగ్ తీసుకోలేదు. కానీ కొన్ని కోచింగ్ సెంటర్లు కావాలనే నా పేరును వాడుకుంటున్నాయి. ఇది దారుణం. మరోసారి స్పష్టం చేస్తున్నా.. నేను సొంతగానే సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యా. తెలుగు సాహిత్యం సొంతగా చదివా, జనరల్ స్టడీస్ మాత్రం బాలలతగారి దగ్గర శిక్షణపొందా. సిటీలోని పలు కోచింగ్ సెంటర్లు నా పేరును, ర్యాంకుతో ప్రకటనలు ఇస్తున్నాయి. అవి తప్పుడు ప్రకటనలు’ అని గోపాలకృష్ణ చెప్పారు. సివిల్స్ పరీక్షలు రాయగోరే అభ్యర్థులు సొంత ప్రిపరేషన్‌కే తొలి ప్రాధాన్యం ఇస్తే మంచిదని గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు. అలా కుదరని పక్షంలో నచ్చిన కోచింగ్ సెంటర్‌కు వెళ్లాలని సూచించారు. అయితే కోచింగ్ సెంటర్లు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని హితవుపలికారు. -
తెలుగు అంటే చాలా ఇష్టం: సివిల్స్ ర్యాంకర్
హైదరాబాద్: తెలుగు అంటే తనకు ఎంతో ఇష్టమని, తెలుగులోనే పరీక్ష రాశానని సివిల్స్ ఆలిండియా మూడో ర్యాంకర్ రోణంకి గోపాలకృష్ణ తెలిపారు. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతుంటే స్నేహితులు, గురువులు అవమానించారని వాపోయారు. దూరవిద్యలో డిగ్రీ చేసి సివిల్స్‌కు ప్రిపరేషన్ అంటే ఎవరెస్టు అధిరోహించడమే అంటూ నిరుత్సాహపరిచారని అన్నారు. గురువారం ‘సాక్షి’ టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. తన కుటుంబం ఎంతగానో ప్రోత్సహించిందన్నారు. గ్రామీణ వాతావరణం, అణగారిన వర్గాల పరిస్థితుల కారణంగా సివిల్స్ వైపు వెళ్లానని వెల్లడించారు. ‘మా గ్రామం నుంచి మమ్మల్సి వెలివేయడం నాకు మరింత కసిని పెంచింద’ని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పారసంబ గ్రామానికి చెందిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) బుధవారం రాత్రి ప్రకటించిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామి నేషన్–2016 ఫలితాల్లో మూడో ర్యాంకు సాధించారు.