అసెంబ్లీని రద్దు చేయాలని సీఎంకు చెప్పా: టీజీ
హైదరాబాద్ : అసెంబ్లీని రద్దు చేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పినట్లు మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. అసెంబ్లీ రద్దు అయితే విభజన బిల్లుపై చర్చ ఉండదని ఆయన గురువారమిక్కడ వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని న్యాయ నిపుణులతోపాటు, ముఖ్యమంత్రితో చర్చిస్తున్నట్లు టీజీ తెలిపారు.
రాష్ట్రానికి వచ్చే ముసాయిదా బిల్లులో రాయల తెలంగాణపై అభిప్రాయం కోరే అంశం ఉంటుందని ..... దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మున్సిపల్ కార్పొరేటర్లు, సర్పంచ్లతో చర్చలు జరుపుతామన్నారు. ఆ తర్వాతే అంతిమ నిర్ణయానికి వస్తామని ఆయన తెలిపారు. విభజన జరిగితే కొత్తపార్టీకి అవకాశం ఉండదని టీజీ పేర్కొన్నారు. ఏపీ ఎన్జీవోల ఛలో ఢిల్లీకి తమ మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు.