అన్ని జోన్లకు దక్షిణ మధ్య రైల్వే ఆదర్శం | Ideal for all zones in the South Central Railway | Sakshi
Sakshi News home page

అన్ని జోన్లకు దక్షిణ మధ్య రైల్వే ఆదర్శం

Published Thu, May 28 2015 11:59 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM

అన్ని జోన్లకు దక్షిణ మధ్య రైల్వే ఆదర్శం - Sakshi

అన్ని జోన్లకు దక్షిణ మధ్య రైల్వే ఆదర్శం

పనితీరు బాగుందంటూ  రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ప్రశంస
 
హైదరాబాద్: ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పక్షోత్సవాలు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో బాగా జరుగుతున్నాయని రైల్వే మంత్రి సురేశ్ ప్రభాకర్ ప్రభు కితాబిచ్చారు. విశాఖపట్నం పర్యటనకు వచ్చిన ఆయన ప్రత్యేక రైలులో ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతూ కాసేపు హైదరాబాద్‌లో ఆగారు. ఈ సమయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవతో పక్షోత్సవాల నిర్వహణపై సమీక్షించారు.

ఇందులో భాగంగా మూడు రోజుల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో వైఫై సేవలను ప్రారంభించిన విషయాన్ని జీఎం ప్రస్తావించారు. అలాగే అదనంగా టికెట్ బుకింగ్ కేంద్రాలను ప్రారంభించినట్టు వెల్లడించారు. ఇతర డివిజన్ల పరిధిలో చేపడుతున్న సేవలను కూడా వివరించారు. అధికారులు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయంటూ ఈ సందర్భంగా సురేశ్ ప్రభు ప్రశంసించారు. దక్షిణ మధ్య రైల్వేను ఆదర్శంగా తీసుకోవాలని మిగతా జోన్లకు సూచిస్తానన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement