సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు తెలిపారు. ఈ మేరకు విజయవాడ-సికింద్రాబాద్ (07207) ప్రత్యేక రైలు ఈ నెల 29న రాత్రి 11 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.40 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్-విజయవాడ (07208) స్పెషల్ ట్రైన్ ఈ నెల 30న రాత్రి 11.15 కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.45కు విజయవాడ చేరుకుంటుంది.
గువాహటి-త్రివేండ్రం (02516) ప్రత్యేక రైలు ఈ నెల 26న (సోమవారం) రాత్రి 11.25కి గువాహటి (అస్సాం) నుంచి బయలుదేరి గురువారం రాత్రి 10.30కి త్రివేండ్రం (కేరళ) చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో త్రివేండ్రం- గువాహటి (02515) ప్రత్యేక రైలు ఈనెల 30న మధ్యాహ్నం 12కి త్రివేండ్రం నుంచి బయలుదేరి వచ్చే నెల ఒకటిన ఉదయం 8.20కి గువాహటి చేరుతుంది. ఇది ఏపీలో వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, గూడూరు స్టేషన్లలో ఆగుతుంది.
విజయవాడ-సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లు
Published Wed, Jan 21 2015 6:28 AM | Last Updated on Sun, Apr 7 2019 3:28 PM
Advertisement
Advertisement