ప్రయాణికుల సౌకర్యార్థం పలు రైళ్లు
సంగడిగుంట: ప్రయాణీకుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ నుంచి గుంటూరు మీదుగా గౌహతీ వరకు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ నడపనున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సి.రామకృష్ణ గురువారం తెలిపారు. నంబరు 07249/07250 రైళ్ళు 20, 27వ తేదీల్లో సికింద్రాబాద్ నుంచి, 23, 30వ తేదీల్లో గౌహతీ నుంచి బయలుదేరనున్నాయి. సికింద్రాబాద్‌లో శుక్రవారం ఉదయ 7.30 గంటలకు బయలుదేరే ఈ రైలు మధ్యాహ్నం 12.10 గంటలకు వస్తుంది. 12.15 గంటలకు గుంటూరు నుంచి బయలుదేరి ఆదివారం ఉదయం 7.55 గంటలకు గౌహతి చేరనుంది. గౌహతి నుంచి సోమవారం ఉదయం 6.00 గంటలకు బయలుదేరి బుధవారం తెల్లవారుజామున 3.00 గంటలకు గుంటూరు వస్తుంది. 3.05 గంటలకు బయలుదేరి ఉదయం పది గంటలకు సికింద్రాబాద్ చేరనుంది. ఈ రైళ్ళలో ఒక ఫస్ట్ ఏసీ కమ్ సెకెండ్ ఏసీ బోగీ, మరో సెకెండ్ ఏసీ బోగీ, 5 స్లీపర్ క్లాస్, ఏడు జనరల్ బోగీలు, రెండు సెకెండ్ క్లాస్ లగేజీ కమ్ బ్రేక్ వ్యాన్లతో కలిపి మొత్తం 16 బోగీలు ఉంటాయి. రైలులో రిజర్వేషన్‌కు పాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌తో చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు రామకృష్ణ వివరించారు.
వారాంతంలో జనసదరన్ ప్రత్యేక రైళ్లు..
వేసవి సెలవులు ముగుస్తున్న సందర్భంగా వేసిన నాలుగు జన్‌సదరన్ ప్రత్యేక వారాంతపు రైళ్లు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ వారాంతంలోనూ నడపనున్నట్లు ఆయన తెలిపారు. నంబరు 07015 రైలు సికింద్రాబాద్ నుంచి కాకినాడ వరకు జన సదరన్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు 20వ తేదీన శుక్రవారం నడపనున్నారు. ఈ రైలు సికింద్రాబాద్‌లో శుక్రవారం రాత్రి 22.40 గంటలకు బయలుదేరి నల్గొండకు 1.05, మిర్యాలగూడకు 1.35, నడికుడి 2.35, పిడుగురాళ్ళ 3.00, సత్తెనపల్లి 3.30, గుంటూరు 4.40 గంటలకు వస్తుంది. విజయవాడకు 5.45, గుడివాడ 7.15, కైకలూరు 7.48, ఆకివీడు 8.05, భీమవరం టౌన్ 8.25, తణుకు 8.45, నిడదవోలు 9.10, రాజమండ్రి 9.45, సామర్లకోట 10.45, కాకినాడ 11.00 గంటలకు చేరనుంది. నంబరు 07209 రైలు కాకినాడ టౌన్ నుంచి గుంటూరు వరకు నడపనున్నారు. ఈ రైలు 21వ తేదీన కాకినాడ టౌన్ నుంచి మధ్యాహ్నం 13.00 గంటలకు బయలుదేరి సామర్లకోట 13.15, రాజమండ్రి 14.20, నిడదవోలు 14.58, తణుకు 15.18, భీమవరం టౌన్ 16.00, ఆకివీడు 16.15, కైకలూరు 16.25, గుడివాడ 16.50, విజయవాడ 18.15, మంగళగిరి 18.51, గుంటూరు 19.15 గంటలకు చేరనుంది. నంబరు 07210తో గుంటూరు నుంచి కాకినాడ టౌన్ వరకు ప్రత్యేక జన్‌సదరన్ రైలును నడపనున్నారు.
ఈ రైలు 21వ తేదీ రాత్రి 22.10 గంటలకు గుంటూరు నుంచి బయలుదేరి మంగళగిరి 22.34, విజయవాడ 23.05, గుడివాడ 00.20, కైకలూరు 00.45, ఆకివీడు 01.10, భీమవరం టౌను 01.35, తణుకు 02.30, నిడదవోలు 02.50, రాజమండ్రి 03.50, సామర్లకోట 04.50, కాకినాడ టౌన్ 05.20 గంటలకు చేరనుంది. నంబరు 07106 రైలు 22వ తేదీన కాకినాడ టౌన్ నుంచి 19.15 గంటలకు బయలుదేరి సామర్లకోట 19.25, రాజమండ్రి 20.20, నిడదవోలు 20.55, తణుకు 21.00, భీమవరం టౌను 22.00, ఆకివీడు 22.25, కైకలూరు 22.50, గుడివాడ 23.45, విజయవాడ 00.50, గుంటూరు 02.00, సత్తెనపల్లి 02.50, పిడుగురాళ్ళ 03.25, నడికుడి 03.50, మిర్యాలగూడ 04.45, నల్గొండ 05.20, సికింద్రాబాద్‌కు 09.45 గంటలకు చేరనుంది. ఈ రైళ్లలోని అన్ని బోగీల్లో రిజర్వేషన్ లేకుండా సాధారణ టిక్కెట్‌తో ప్రయాణించవచ్చు. సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని రామకృష్ణ కోరారు.