'బాబు సమైక్యవాదైతే వెంటనే రాజీనామా చేయాలి'
హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమైక్యవాదైతే వెంటనే రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. తాను సమైక్యవాదినని చెప్పుకుంటూ ప్రజలను గందరగోళ పరిస్థితులు నెడుతున్న బాబు వెంటనే రాజీనామా చేసి, ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని అంబటి సూచించారు. గతంలో కాంగ్రెస్ కు సహకారమందించిన బాబు ద్వంద్వ వైఖరిపై ఆయన మండిపడ్డారు. దీనికి సంబంధించి గురువారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నుంచి ప్రభుత్వాన్ని కాపాడిన ఘనత బాబుది కాదా అని ప్రశ్నించారు.
గోడమీది పిల్లిలా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశానని గొప్పలు చెబుతున్న బాబు, ప్రస్తుత పరిస్థితిపై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు.బాబు మానసికపరిస్థితి సరిగి లేనందున పిచ్చాసుపత్రిలో చేర్పించాలని అంబటి ఎద్దేవా చేశారు.