నమ్మితే అభివృద్ధి చేస్తా
- సీఎం చంద్రబాబు నాయుడు
- గుంటూరు జిల్లాలో ఆరోగ్య రక్ష పథకం ప్రారంభం
ముప్పాళ్ల /నగరంపాలెం (సత్తెనపల్లి): రాజధాని ప్రాంతంలో రైతులు తనను నమ్మినట్లే రాష్ట్ర ప్రజలు కూడా నమ్మితే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి, నరసరావుపేట నియోజక వర్గాల్లో శనివారం పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ముప్పాళ్ల మండలం గోళ్లపాడులో ఆరోగ్య రక్ష పథకాన్ని సీఎం ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. 2018 నాటికి రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్‌గా చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. వచ్చే ఏడాదికి అన్ని జిల్లా లను బహిరంగ మలవిస ర్జన లేని జిల్లాలుగా చేసి స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ను సాధిస్తామన్నారు. మనిషిగా పుట్టినోడు మరుగుదొడ్డి తప్పనిసరిగా వాడాలన్నారు.
దేశంలో వాజ్‌పేయి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో దేశంలో సెల్‌ఫోన్ ప్రవేశపెట్టాలని సూచనచేయడంతో పాటు దానిపై ఏర్పాటు చేసిన కమిటీకి కో–చైర్‌పర్సన్‌గా వ్యవహరించి రిపోర్టు కేంద్రానికి పంపినట్లు తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మనవాళ్ల తెలివితేటలపై అక్కడి వారికి అసూయ పెరిగిందన్నారు. శాసనసభ స్పీకర్ డా.కోడెల శివప్రసాదరావు మాట్లా డుతూ.. ఆరోగ్య రక్ష పథకాన్ని ముప్పాళ్ల మండలంలో ఆవిష్కరించటం ఆనందంగా ఉందన్నారు. నూరుశాతం మరుగుదొడ్లు నిర్మించి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించు కోవడం గర్వంగా ఉందని చెప్పారు.
నేడు ఉత్తరప్రదేశ్‌కు సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం ఉత్తర ప్రదేశ్ వెళ్లనున్నారు. ఆ రాష్ట్ర నూతన ముఖ్య మంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమానికి చంద్రబాబు హాజరతున్నట్లు ఆయన మీడి యా సలహాదారు కార్యాలయం తెలిపింది.