
కలమట వెంకట రమణ
శ్రీకాకుళం/గజపతి: ఒడిస్సాలోని గజపతి జిల్లా దంబాపూర్ వద్ద మహేంద్ర తనయ నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టు పనులను శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైఎస్ఆర్ సీపీ శాసనసభ్యుడు కలమట వెంకట రమణ ఈరోజు పరిశీలించారు. ఈ నదిపై 29 కోట్ల రూపాయలతో ప్రాజెక్టుని నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా వెంకట రమణ మాట్లాడుతూ ఒడిస్సా అక్రమ నిర్మాణం వల్ల పాతపట్నం నియోజవకర్గంలో తాగునీటి కొరత ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.