భూములు మింగే రాబందులు | illegal land occupied in Kandukuru | Sakshi
Sakshi News home page

భూములు మింగే రాబందులు

Published Thu, Nov 2 2017 4:03 PM | Last Updated on Thu, Nov 2 2017 4:03 PM

illegal  land occupied in Kandukuru - Sakshi

కందుకూరు అర్బన్‌: కందుకూరు పట్టణంలో ఎక్కడైనా కాస్త ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు ఆక్రమణదారులు రాబందుల్లా వాలిపోతున్నారు. పదేళ్ల క్రితం అప్పటి కలెక్టర్‌ కృష్ణబాబు కందుకూరు పట్టణంలో ఆక్రమణలకు గురైన స్థలాలను గుర్తించి బోర్డులు పెట్టి కంచె ఏర్పాటు చేశారు. కలెక్టరు ఆదేశాలను బేఖాతరు చేసి కంచెను పీకేసి ఆ స్థలాల్లో ధనవంతులు ఇప్పుడు పెద్దపెద్ద భవనాలు కట్టారు. డొంకపోరంబోకు భూమి 2.15 సెంట్లు ఆక్రమించి ఓ పెద్దమనిషి కళాశాల నిర్మించారు.

అదే వ్యక్తి కోవూరు రోడ్డులోని పుష్పాలంకరణ ఇనాం భూమి 8 ఎకరాలు ఆక్రమించి పట్టాలు పొందారు. రామన్నకుంట చలివేంద్రం మాన్యం భూమి 1.53 ఎకరాలను ఓ అధికారపార్టీ నాయకుడు ఆక్రమించి మట్టితో చదును చేసి వినియోగించుకుంటున్నారు. ఈ భూమిని కూడా మరో కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే స్వయంగా పరిశీలించి  ప్రభుత్వ భూములుగా గుర్తించి వాటిని స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఏడాదిన్నర క్రితం కందుకూరు సబ్‌కలెక్టరుగా బాధ్యతలు స్వీకరించిన మల్లికార్జున గుండంకట్టను సర్వేచేసి 6 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు గుర్తించారు. సర్వే నంబర్‌ 865లో గ్రామకంఠం భూమి 56 సెంట్లు ఆక్రమించి లారీ స్టాండుకు ఉపయోగించుకుంటున్నారు.

ఈ విషయమై మున్సిపల్‌ అధికారులు కోర్టును ఆశ్రయించగా, దానిని స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా నేటికీ చర్యలు తీసుకోలేదు. ఇటీవల కాలంలో ఓ వ్యక్తి ప్రభుత్వ ఏరియా వైద్యశాల ఎదురుగా మున్సిపల్‌ కాంప్లెక్స్‌ నిర్మించాలనుకున్న స్థలాన్ని ఆక్రమించి ఇల్లు కట్టుకున్నాడు. ఇలా పట్టణంలో సెంటు భూమిని కూడా వదలకుండా ధనవంతులు రాబందుల్లా రూ.100 కోట్లకు పైగా విలువచేసే ప్రభుత్వ భూములను ఆక్రమించారు. వారిపై చర్యలు తీసుకోని రెవెన్యూ అధికారులు, పేదలు చిన్న పాటి గుడిసెను వేసుకుంటే ఉరుకులు పరుగులు తీసి వాటిని కూలదోస్తున్నారు.

బలహీనుల ఇళ్లు కూలగొట్టి..పెద్దలకు కట్టబెట్టి..
పట్టణంలోని ఓ వ్యక్తి రూ.14 లక్షలకు ఇంటిని కొనుగోలు చేసి 11 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. ఒక వ్యక్తి తనకు దారి ఇవ్వలేదని కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల మేరకు ఆ ఇంటిని కూలదోసి, ఎవరైతే దారి అడిగారో వారికే  రూ.2.4 లక్షలకు మార్కెట్‌ ధరకు కట్టబెట్టిన రెవెన్యూ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  పట్టణంలోని సర్వే నంబర్‌ 271లో ఉన్న డొంక పోరంబోకు భూమిని (ప్రస్తుత 30 వార్డులోని 60 అడుగుల రోడ్డు) గాలేటి కాంతమ్మకి మూడున్నర సెంట్లు, భవనాసి నాగరాజమ్మకు 2 సెంట్లు మొత్తం కలిపి ఐదున్నర సెంట్ల ప్రభుత్వ భూమిని నివాస స్థలాల కోసం 1985లో ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేసింది. వారిద్దరి వద్ద చిర్రవెంకటేశ్వర్లు ఒక సెంటు, సరస్వతి అనే మహిళ ఒకటిన్నర సెంట్లు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకున్నారు. దాంట్లో మిగిలి ఉన్న మూడున్నర సెంట్ల భూమిని భార్యాభర్తలు కల్లూరి ఈశ్వరమ్మ, తిరుపతయ్య  2006లో రూ.14 లక్షలకు కొనుగోలు చేసి ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు.

అయితే వీరి ఇంటి వెనుక భాగంలో ఉన్న ఒక రిటైర్డు తహసీల్దారు తన ఇంటికి రాకపోకలకు దారి ఇవ్వాలని అడిగారు. దానికి తిరుపతయ్య నిరాకరించాడు. దాంతో ఆ రిటైర్డు తహసీల్దారు ప్రభుత్వ భూమి ఆక్రమించి ఇల్లు కట్టుకున్నారని 2013లో కోర్టును ఆశ్రయించారు. కోర్టు రెవెన్యూ అధికారులను ఆ స్థలాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిగా గుర్తించి నివేదిక అందజేశారు. కోర్టు పీఓటీ యాక్ట్‌ ప్రకారం ఆక్రమణలను తొలగించి స్థలాలను స్వాధీనం చేసుకోవాలని  రెవెన్యూ అధికారులను ఆదేశించింది.  ఆ మేరకు 2016లో అధికారులు ఆక్రమణలను తొలగించడానికి వెళ్లగా ఇప్పటికిప్పుడు ఇంటిని స్వాధీనం చేసుకుంటే మేం ఎక్కడ ఉండాలని అధికారులను అడిగారు. దీంతో అధికారులు తిరుపతయ్య ఇంటికి సంబంధించిన కొంత భాగం, చిర్ర వెంకటేశ్వర్లు ఇంటిని కూల్చివేసి, ఇంటిని ఖాళీ చేయాలని తిరుపతయ్యను ఆదేశించారు.

ఆ తరువాత తిరుపతయ్య మళ్లీ కోర్టును ఆశ్రయించగా  ఆర్డీఓ కోర్టుకి ఆ కేసును బదిలీ చేసింది. విచారించిన ఆర్డీఓ ఇంటిని ఖాళీ చేయాలని సెప్టెంబర్‌ 9వ తేదీన అతనికి నోటీసులు జారీ చేశారు. ఆయన ఖాళీ చేయకపోవడంతో గత నెల 22న రెవెన్యూ అధికారులు తిరుపతయ్య ఇంటికి చేరుకొని ఎవరూ లేకపోవడంతో కెమెరా దగ్గర పెట్టుకొని ఇంట్లోని సామానులను మినీలారీకి ఎక్కించి, ఇంటిని జేసీబీతో కూల్చివేశారు. ఇంత వరకు బాగానే ఉంది.  తిరుపతయ్య ఇంటి సగభాగాన్ని 2016లో కూల్చిన అధికారులు అదే స్థలాన్ని మార్కెట్‌ ధరకు 85 స్కైర్‌మీటర్ల స్థలాన్ని రిటైర్డు తహసీల్దారుకు రూ.2.4 లక్షలకు అమ్మటం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.

11 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న తిరుపతయ్య ఇంటిని కూల్చి ఇతరులకు ఇవ్వడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బాధితుడు ఆ స్థలాన్ని తనకే మార్కెట్‌ ధరకు ఇవ్వమని ప్రాధేయపడినా అధికారులు నిరాకరించారు. పీఓటీ యాక్ట్‌ ప్రకారం ప్రభుత్వ స్థలాలు అమ్మినవారిపై, కొన్నవారిపై చర్యలు తీసుకోవాల్సిందే. స్వాధీనం చేసుకున్న స్థలాన్ని ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలి. కానీ అధికారులు ఈ యాక్ట్‌ను బేఖాతరు చేస్తూ అధికారపార్టీ నాయకులకు, వారి అనుయాయులకు ప్రభుత్వ భూములు ధారదత్తం చేస్తూ పేదలకు అన్యాయం చేస్తున్నారు. పట్టణంలో కోట్లు విలువైన భూములను ధనవంతులు యథేచ్ఛగా ఆక్రమించుకుంటుంటే రెవెన్యూ అధికారులు చోద్యం చూడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కందుకూరు పట్టణంలో ఎక్కడైనా కాస్త ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు ఆక్రమణదారులు రాబందుల్లా వాలిపోతున్నారు. పదేళ్ల క్రితం అప్పటి కలెక్టర్‌ కృష్ణబాబు కందుకూరు పట్టణంలో ఆక్రమణలకు గురైన స్థలాలను గుర్తించి బోర్డులు పెట్టి కంచె ఏర్పాటు చేశారు. కలెక్టరు ఆదేశాలను బేఖాతరు చేసి కంచెను పీకేసి ఆ స్థలాల్లో ధనవంతులు ఇప్పుడు పెద్దపెద్ద భవనాలు కట్టారు. డొంకపోరంబోకు భూమి 2.15 సెంట్లు ఆక్రమించి ఓ పెద్దమనిషి కళాశాల నిర్మించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement