
'మోసం చేసి ల్యాండ్ పూలింగ్'
హైదరాబాద్: ఏపీ రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలు కొన్న భూముల వివరాలు వెబ్ సైట్ నుంచి ఎందుకు తొలగించారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. భూ దందా గురించి మాట్లాడకుండా భూములు కొంటే తప్పేంటని చంద్రబాబు ఎదురుదాడి చేస్తున్నారని వాపోయారు.
పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అమాయక రైతులను మోసం చేసి రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ చేశారని ఆరోపించారు. రాజధాని పట్ల చంద్రబాబు చిత్తశుద్ధి ఏంటో ప్రజలకు తెలిసిపోయిందన్నారు. టీడీపీ నేతలు భూములు కొని పేద ప్రజలను మోసం చేశారని, దీన్ని 'సాక్షి' వెలుగులోకి తెస్తే తప్పా అని ప్రశ్నించారు.