విశాఖలో మైనింగ్‌ మాఫియా అక్రమాలు.. | Illegal Mining Mafia In Vishakapatnam | Sakshi
Sakshi News home page

మైనింగ్‌ మాఫియా అక్రమాలపై దాడులు

Published Fri, Jul 17 2020 5:58 PM | Last Updated on Fri, Jul 17 2020 6:28 PM

Illegal Mining Mafia In Vishakapatnam  - Sakshi

సాక్షి, విశాఖపట్నం: మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడిన కంపెనీలపై శుక్రవారం అధికారులు దాడులు చేశారు. గడిచిన 10 రోజుల్లో విశాఖలోనే మైనింగ్‌ మాఫియా అక్రమాలకు రూ.120 కోట్లు ఫైన్‌ వేశారు. మొత్తం 9 క్వారీ లీజుల్లో అక్రమాలను అధికారులు గుర్తించారు. అయితే గత కొన్నేళ్లుగా నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న వీవీఆర్‌ గ్రూప్‌లో దాడులు చేశారు. 

ఈ దాడులలో భారీ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన అధికారులు 8 క్వారీలకు రూ.114 కోట్లు ఫైన్‌తో పాటు నాలుగు క్వారీలకు సంబంధించిన అక్రమాలపై ఇప్పటికే వీవీఆర్‌ గ్రూప్‌కు నోటీసులు జారీ చేశారు. కాగా 5 క్వారీల్లో తవ్వని వాటికి కూడా ప్రభుత్వం నుంచి బిల్లులు పొందినట్లు నిర్ధారణయింది. పర్యావరణ అనుమతులు, భద్రతా ప్రమాణాలు పాటించకుండా అక్రమ తవ్వకాలు జరిపినట్లు అధికారులు గుర్తించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement