కర్నూలు రూరల్, న్యూస్‌లైన్ :
అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు లారీలను బుధవారం అర్ధరాత్రి రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. పంచలింగాల సమీపం నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో తహశీల్దార్ బాలగణేశయ్య ఆర్‌ఐని అలర్ట్ చేసి అక్కడకు పంపించారు. అనంతరం తాను కూడా బైక్‌పై వె ళ్లారు. లారీలను ఇసుకతో నింపుకొని డంపు నుంచి బయటకు వస్తుండగా రెండింటిని సీజ్ చేశారు. అయితే అధికారుల రాక ఆలస్యం కావడం, వారి తనిఖీలకు ముందే తెలిసిపోవడంతో ఇసుకాసులు కూడా అప్రమత్తమయ్యారు. ఇసుక తవ్వకానికి ఉపయోగిస్తున్న జేసీబీ సహా మూడు లారీలతో స్టాన్లీ స్టీఫెన్ ఇంజినీరింగ్ కళాశాల వైపు పరారయ్యారు. తర్వాత వచ్చిన అధికారులు ఇసుక నింపుకొని డంపు దాటి వస్తున్న రెండు లారీలను సీజ్ చేసి రెవెన్యూ కార్యాలయానికి తరలించారు. మరో మూడు వాహనాలు, జేసీబీతో సహా ఇసుకాసురులు పరారైనట్లు తెలిసినప్పటికీ అధికారులు ఆ వైపు వెళ్లకపోవడంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసులే వంతపాడుతున్నారు : తహశీల్దార్
ఇసుక మాఫియా వద్ద నుంచి మామూళ్లు పుచ్చుకుంటూ పోలీసులే వారికి వంతపాడుతూ ఇసుక అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నారని తహశీల్దార్ బాలగణేశయ్య అన్నారు. ఇసుక లారీలను సీజ్ వివరాలను తహశీల్దార్ గురువారం తన కార్యాలయంలో విలేకరులకు వెళ్లడించారు. బుధవారం అర్ధరాత్రి ఇసుకను అక్రమంగా హైదరాబాద్‌లోని మెహిదీపట్నానికి తరలించేందుకు పంచలింగాల సమీపంలో లారీలకు లోడ్ చేసుకుంటున్నట్లు సమాచారం అందడంతో వెళ్లి రెండింటిని సీజ్ చేశామన్నారు. ఇసుక మాఫియా నియంత్రణలో పోలీసు ల నుంచి పూర్తిస్థాయిలో సహకారం ఉండడం లేదన్నా రు. కొన్ని చోట్ల పోలీసులే దగ్గరుండి మరీ ఇసుక అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నారన్నారు. పంచలింగాల క్రాస్ వద్ద జాతీ య రహదారిపై ఇసుకాసురుల నుంచి మామూళ్లు వసూలు చేస్తుండగా ఈ మధ్య తనిఖీలకు వెళ్లినప్పు డు తాను గమనించానని, ఇదేంటని ప్రశ్నిస్తే వాహనాలు తనిఖీ చేస్తున్నామంటూ బూకాయిం చే ప్రయత్నం చేశారన్నారు. ఇందుకు సంబంధించి జిల్లా అధికారులకుకూడాఫిర్యాదు చేశామని తహశీల్దార్ చెప్పా రు.
అక్రమ రవాణాపై నిఘా పెట్టినప్పటికీ ఇసుక మాఫియాను పూర్తిస్థాయిలో నియంత్రించలేకపోతున్నామని చెప్పిన తహశీల్దార్ వీరికి రాజకీయ అండదండలున్నట్లు అర్థమవుతోందన్నారు. పంచలింగాల గ్రామానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి ఇసుకను మెహిదీపట్నం తరలించేం దుకు ఒప్పందం చేసుకున్నట్లు తెలిసిందని, ఈ మేరకు రాత్రివేళ్లలో తరలిస్తున్నారని తహశీల్దార్ తెలిపారు.
ఇసుకాసురులపై దాడులు
Published Fri, Nov 8 2013 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 12:23 AM
Advertisement