అచ్చంపేట, న్యూస్‌లైన్: నాలుగు రోజుల పాటు ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షా లు నల్లమల ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశా యి. రైతులను కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. స్థానికులు ఇంకా తేరుకోలేపోతున్నారు.
గత మంగళవారం నుంచి శుక్రవారం వరకు కురిసిన భారీవర్షాలు అన్నదాతను నిలువునా ముంచాయి. నల్లమల లో గరిష్ట వర్షపాతం 23 సెం.మీ నమోదైం ది. కుండపోత వర్షంతో వాగులు, వంకలు ఏకమై పారాయి. ని యోజకవర్గంలోని అచ్చంపేట, బల్మూర్, లింగాల, అమ్రాబాద్, ఉప్పునుంతల, వంగూరు మండలాల్లో వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. రెవెన్యూ, వ్యవసాయశాఖల వద్ద ఇప్పటివరకు ఎంతనష్టం జరిగిందనే ప్రాథమిక అంచనాల్లేవు. ఈ ఖరీఫ్‌లో అంచనాలకు మించి వివిధ పంటలు సాగయ్యాయి. వరదలు ముం చెత్తడంతో పంటలు చేతికిరాకుండాపోయాయి. దొరికినచోటల్లా రైతులు అప్పులు తెచ్చి వ్యవసాయం చేశారు. కనీసం పెట్టిన పెట్టుబడి కూ డా రాని దుస్థితిని చూసి ఆందోళన చెందుతున్నారు.
వరదతాకిడికి నియోజకవర్గంలో 8 చెరువులు, ఆరు కుంటలు తెగి భారీగా పంటనష్టం జరిగింది. నిండుకుండలా ఉన్న మిగిలిన కుం టలు, చెరువులు తెగిపోయే ప్రమాదంలో ఉన్నా యి. 2009 తర్వాత కురిసిన భారీవర్షాల తర్వా త కురిసిన వర్షం ఇదే కావడంతో మూడేళ్ల కరు వు విరామం తర్వాత కాలం అయిందని అనుకుంటే అధికవర్షాలు మరోసారి రైతన్నను కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. ఖరీఫ్‌లో వేసిన వరి, పత్తి, మొక్కజొన్న, ఆముదం, జొన్న పం టలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. 20రోజుల క్రితం సాగుచేసిన రబీ వరి, వేరుశనగ సాగుచేసి న రైతుల దుస్థితి దారుణంగా మారింది. ఎకరా కు రైతులు రూ.15వేల నుంచి 20వేల వరకు ఖర్చుచేసి సాగుచేశారు. భారీవర్షాలకు వేరుశనగ ఇసుక మేటలు వేసి విత్తు మొలకెత్తని పరిస్థితి నెలకొంది.
రూ.50కోట్ల పంట నష్టం
ఈ ఖరీఫ్‌లో నియోజకవర్గంలో నాలుగు వేల హెక్టార్లలో వరి, 15వేల హెక్టార్లలో పత్తి, 20వేల హెక్టార్లలో మొక్కొజొన్న, ఏడువేల హెక్టార్లలో జొన్న, మరో ఐదువేల హెక్టార్లలో ఆముదం, ఇతర పంటలు సాగుచేశారు. రబీలో15వేల ఎకరాల్లో వేరుశనగ పంటసాగు చేశారు. వర్షాలకు సుమారు రూ.50కోట్ల పంటనష్టం వాటిల్లింది.
వరదలో కొట్టుకుపోయిన మోటార్లు
అచ్చంపేట మండలం కేశ్యతండా గిరిజన రైతులకు చెందిన 15 కరెంటు మోటార్లు రోలాపాయ, బైరమ్‌సేలాం వాగులో కొట్టుకుపోయాయి. 25ఎకరాల పంట నష్టపోయినట్లు రైతులు జరుపుల గోపాల్, లక్ష్మణ్‌లు వాపోయారు. కానుగుల వాగు చెరువు అలుగు ఉధృతికి మర్లపాడు గ్రామానికి చెందిన రైతులు జక్కుల ముత్తయ్య, సాయులు లింగయ్య, జబ్బు జంగయ్యకు చెందిన పొట్టకొచ్చిన వరిపంట పూర్తిగా నాశనమైంది. చీన్యాతండాలో తెట్టకుంట నీటి ప్రవాహానికి పంటనష్టం వాటిల్లింది.
అచ్చంపేట మండలంలోని సిద్ధాపూర్ పాతచెరువుకు గండిపడి వందెకరాల్లో వరిపంట కొట్టుకుపోయింది. పొలాల్లో ఇసుకమేటలు వేశాయి. చెరువుగండి మట్టిదిబ్బలు పొలాల్లో పేరుకుపోయాయి. ఆయకట్టు పరిధిలో 600 ఎకరాల పంట నాశనమైంది. చెరువుకు గండిపడటంతో ప్రస్తుతం చుక్కనీరు కూడా లేదు. మరోనెల రోజులైతే పంటచేతికొచ్చే సమయంలో వరదరైతులను నట్టేట ముంచింది. కానుగుల వాగు ఉధృతికి పంట నాశనమైంది.
తేరుకోని ఏజెన్సీ
Published Mon, Oct 28 2013 2:53 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement