నేటి నుంచి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): శాస్త్ర సాకేంతిక రంగాల పరిశోధనలో విద్యార్థులను ఆకర్షించేం దుకు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన(ఇన్‌స్పైర్) బుధవారం నుంచి ప్రారంభం కానుంది. స్థానిక సంతపేట సెయింట్‌జాన్స్ తెలుగుమీడియం పాఠశాల్లో జిల్లా స్థాయి 4వ ఇన్‌స్పైర్‌ను మూడు రోజులపాటు నిర్వహిస్తారు. మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల ప్రాజెక్ట్ వివరాలను తెలిపే రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇందుకోసం 10 కౌం టర్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో సు మారు 700 మంది విద్యార్థులు తమ సృజనాత్మక శక్తిని ప్రదర్శించనున్నారు. ఒక్కొక్క ప్రాజెక్ట్‌కు ఒక విద్యార్థి, ఒక గైడ్ హాజరవుతారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులు గైడ్ సాయంతో వివిధ అంశాలపై ప్రాజెక్ట్‌లను రూపొందించారు.
పదర్శనలో పాల్గొనే వారికి ఉచిత భోజన వసతిని కల్పించారు. మొత్తం ప్రాజెక్ట్‌ల్లో 7 శాతం ప్రాజెక్ట్‌లను రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్‌కు ఎంపిక చేస్తారు. డీఈఓ ఎన్.ఉషా, డిప్యూటీ ఈఓలు మేరీచంద్రిక, మేరీహారతి, ఏర్పాట్లను పర్యవేక్షించారు. పాఠశాల స్థాయి నుంచే సైన్స్‌పై అవగాహన కలిగించేందుకు ఇన్‌స్పైర్ కార్యక్రమాన్ని 12వ పంచవర్ష ప్రణాళికలో ఏర్పాటు చేశారు. ఒక్కొక్క ప్రాజెక్ట్, మో డల్ రూపొందించేందుకు రూ.5 వేలను చెల్లిస్తారు. సైన్స్ టీచర్ మార్గదర్శకంలో విద్యార్థి సృజనాత్మకతను జోడించి విజ్ఞానాభివృద్ధికి తోడ్పడేలా మోడల్స్‌ను తయారు చేయాలి.
నిర్దేశించిన సమయం
ఈ వైజ్ఞానిక ప్రదర్శనను తిలకించేందుకు డివి జన్ల వారీగా తేదీలను నిర్ణయించారు. 30న ఉదయం కావలి డివిజన్, నెల్లూరు డివిజన్ రైల్వే ట్రాక్ తూర్పు వైపు ఉన్న పాఠశాల విద్యార్థులు, 31న గూడూరు డివిజన్, నెల్లూరు డివి జన్ రైల్వే ట్రాక్‌కు పడమర వైపున్న స్కూళ్ల వి ద్యార్థులు, 1న నెల్లూరు డివిజన్, మిగిలిన స్కూళ్ల విద్యార్థులు తిలకించవచ్చు.
ఈ సారైనా...
ఇన్‌స్పైర్ నిర్వహణపై పలు ఆరోపణలున్నాయి. గతంలో 2012 వైజ్ఞానిక ప్రదర్శనలో నిధుల వినియోగంలో అవకతవకలు జరిగాయని గత వారమే ఆర్‌జేడీ విచారణ నిర్వహిం చారు. వైజ్ఞానిక ప్రదర్శనలో జరుగుతున్న అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థికి ఇవ్వాల్సిన రూ.5వేలను టీచర్లే స్వాహా చేశారని వాస్తవాన్ని ఉపాధ్యాయ వర్గమే జీర్ణించుకోలేక పో తుంది. దీనికి తోడు ప్రజా ప్రతినిధి విరాళంగా ఇచ్చిన రూ.లక్షా 50వేలు కూడా స్వాహా చేశారని తెలియడంతో వైజ్ఞానిక ప్రదర్శన పేరుతో విపరీతంగా డబ్బులు దండుకున్నారనే మరో కోణం బయటకొచ్చింది.
జ్యూరీ సభ్యులు పరిశీలించాలి
వైజ్ఞానిక ప్రదర్శనలో ఏర్పాటుచేసిన ప్రతి మోడల్‌ను జ్యూరీ సభ్యులు పరిశీలించాలి. అ యితే వారు లాబియింగ్‌కు పాల్పడుతూ తమ ఇష్టానుసారంగా ప్రాజెక్ట్‌ల ఎంపికలు చేస్తున్నారని ఆరోపణలున్నాయి. ప్రతి ప్రాజెక్ట్ ను క్షుణ్ణంగా పరిశీలించినిబంధనలననుసరించి మోడళ్ల ఎంపిక చేయాల్సిన అవసరం ఉంది.
ఏర్పాట్లు: ఈ ఏడాది ఇన్‌స్పైర్ నిర్వహణ ఏర్పాట్లలో హడావిడి.. ఆర్భాటం కనపడింది. ప్రణాళికా బద్ధంగా ఏర్పాట్లు చేయకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులను ఎదుర్కోవా ల్సి వచ్చింది. ప్రాజెక్ట్‌ల రిజిస్ట్రేషన్లలో తీవ్ర జా ప్యం నెలకొంది. విద్యార్థులు ఇబ్బందులు ప డ్డారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు తమ ప్రాజెక్ట్‌లు, లగేజీలను కాపాడుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. భోజనపు టో కెన్ల కౌంటర్ వద్ద రద్దీ పెరగడంతో తోపులాట జరిగింది. కమిటీల మధ్య సమన్వయలోపంతో చిన్న సమస్య సైతం పెద్దదైంది. సమన్వయ పరచాల్సిన వారు కరువవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.