అణువణువునా భారతీయత : దీపా వెంకట్ | indian nationality seen in every movement here,says deepa venkat | Sakshi
Sakshi News home page

అణువణువునా భారతీయత : దీపా వెంకట్

Published Tue, Nov 11 2014 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 PM

అణువణువునా భారతీయత : దీపా వెంకట్

అణువణువునా భారతీయత : దీపా వెంకట్

విజయనగరం రూరల్: సైనిక పాఠశాలలో అణువణువునా భారతీయత ప్రతిబింబిస్తోందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ అన్నారు. విజయనగరం సమీపంలోని కోరుకొండ సైనిక స్కూల్‌ను ఆమె సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు సైనిక పాఠశాల రిజిస్ట్రార్, లెఫ్ట్‌నెంట్ కల్నల్ ఎం.అశోక్‌బాబు పాఠశాల ప్రాంగణంలోని విద్యార్థుల హౌస్‌లు, మెస్ హాల్, సైనిక పాఠశాల అడ్మినిస్ట్రేషన్ భవనం, మైదానాలు, తదితర వాటిని చూపించి వివరించారు.

అనంతరం ప్రిన్సిపాల్, గ్రూప్‌కెప్టెన్ పి.రవికుమార్ పాఠశాలలో చేస్తున్న కార్యకలాపాలు, విద్యార్థుల ప్రాధాన్యతను వివరించారు. అనంతరం ఆమె మాట్లాడారు. పాఠశాలలో విద్యార్థుల క్రమశిక్షణ, ఉపాధ్యాయుల అంకిత భావం ఎంతో గొప్పగా ఉందని కొనియాడారు. ప్రతి విద్యార్థి, ఉపాధ్యాయులలోను, పాఠశాల ఆవరణలో దేశభక్తి ప్రస్పుష్టంగా కనిపిస్తోందని చెప్పారు. పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న పూర్వ విద్యార్థులు వారి చదివిన పాఠశాలపై వారికి ఉన్న గౌరవభావాన్ని తెలియజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.          

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement