సాక్షి, విజయవాడ: దుర్గమ్మ కొలువై ఉన్న ఇంద్రకీలాద్రిలోని ఆలయ ఈవో కార్యాలయంలో రెండేళ్లకే పైకప్పు పెచ్చులూడడంపై ఈవో కోటేశ్వరమ్మ విచారణకు ఆదేశించారు. నాసిరక నిర్మాణంపై అధికారులతో కమిటీ వేసి నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెడతామన్నారు. గత ఈవోల హయాంలో ఈ పనులు జరిగినందున అవినీతి గురించి ఇప్పుడే చెప్పలేమన్నారు. ఈవో కార్యాలయంలోనే డొల్లతనం బయటపడడం ఒక రకంగా మంచిదేనని దేవస్థానంలో మిగిలిన నిర్మాణాలపై దృష్టి సారించి భక్తులకు ఇబ్బంది కలుగకుండా కట్టడాల నాణ్యతను పర్యవేక్షిస్తామని ఆమె వెల్లడించారు. రూ. పది లక్షల ఖర్చుతో రెండేళ్ల క్రితమే పార్టేషన్ పనులను చేయగా ఇప్పుడే ఇలా జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment