ఝులక్ ఇచ్చిన చంద్రశేఖర్‌ఆజాద్ | tdp leaders hulchul in indrakiladri | Sakshi
Sakshi News home page

ఝులక్ ఇచ్చిన చంద్రశేఖర్‌ఆజాద్

Published Sat, Jun 11 2016 8:22 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

ఝులక్ ఇచ్చిన చంద్రశేఖర్‌ఆజాద్ - Sakshi

ఝులక్ ఇచ్చిన చంద్రశేఖర్‌ఆజాద్

దుకాణాల కోసం తెలుగు తమ్ముళ్ల ఆరాటం
వేలంపాట రద్దు చేసి తమకే  కేటాయించాలని డిమాండ్
కొండదిగువన దుకాణలు ఇస్తానని ఈవో హామీ
 
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై  రెండు దశాబ్దాలుగా దుకాణాలు నడుపుతున్నవారికి  ఈవో చంద్రశేఖర్‌ఆజాద్ ఝులక్ ఇచ్చారు. అయితే దీన్ని అర్ధం చేసుకున్న దుకాణాదారులు ఈవోపై వత్తిడి తెచ్చి పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. చివరకు దేవాదాయ శాఖ ఉన్నతధికారులకు, దుకాణదారుల మధ్య రాయ‘బేరాలు’సాగుతున్నాయనే అనుమానం వ్యక్తం అవుతోంది.
 
 ఐదో అంతస్తులో షాపులు కేటాయింపు......
 ఘాట్‌రోడ్డులో దుకాణాలు తొలగించాలని అనేక  సంవత్సరాలుగా ప్రయత్నించినా కార్యరూపం దాల్చలేదు. చివరకు హైకోర్టు షాపుల్ని ఖాళీ చేయించి కొత్తవారికి ఇవ్వవచ్చని ఆదేశాలు ఇచ్చినా అధికారులు వారిని కదల్చలేకపోయారు. బీజేపీ-టీడీపీ నేతలకు ఇక్కడ షాపులు ఉండడమే ఇందుకు కారణం. అయితే ప్రస్తుతం దుర్గగుడి విస్తరణలో భాగంగా కొద్ది రోజులుగా షాపులను మూయించారు. షాపుల్ని ఐదోఅంతస్తులోకి తరలిస్తున్నామని చెప్పి శుక్రవారం  వేలంపాట నిర్వహించారు.

అయితే అనేక సంవత్సరాలుగా ఇంద్రకీలాద్రిపై వ్యాపారాలు చేస్తున్నవారికి ఇది రుచించలేదు. దీంతో దేవస్థానం అధికారులు, దేవాదాయశాఖ ఉన్నతాధికారులపై  వేలంపాట వాయిదా వేయాలని వత్తిడి తెచ్చారు. కాంగ్రెస్ హయాంలోనే తాము దుకాణాలకు వేలంపాట నిర్వహించకుండా జాగ్త్రత్తలు తీసుకున్నామని, ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలో   ఎలా నిర్వహిస్తారని అధికారులపై  ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. ఒకైవె పు అధికారులపై వత్తిడి పెంచుతూనే మరోకవైపు దేవాదాయశాఖలోని  ఉన్నతస్థాయిలో బేరసారాలు  సాగించారని ఆరోపణలు వస్తున్నాయి.
 
 కింద ఇచ్చేందుకు అంగీకారం....
దీంతో దేవాదాయశాఖ ఉన్నతాధికారుల  నుంచి వచ్చిన వత్తిడి ప్రకారం ప్రస్తుతం ఇంద్రకీలాద్రి పై ఉన్న 16 దుకాణాలకు కొండదిగువన కొత్తగా దుకాణాలు నిర్మించి ఇస్తామని ఐదో అంతస్తులోని 16 దుకాణాలకు వేలంపాట నిర్వహిస్తామని ఈవో హామీ ఇచ్చారు.

దీంతో శుక్రవారం సాయంత్రం అప్పటికప్పుడు టెండర్ షెల్యూల్డ్‌లో ఆఖరి అంశంగా కొండదిగువన కొన్ని దుకాణాలకు వేలంపాట  నిర్వహించి ఇప్పటికే వ్యాపారం చేస్తున్న వారికి కేటాయిస్తామనే అంశం చేర్చారు. దీని వెనుక పెద్దఎత్తున ముడుపులు చేతులు మారాయని అంటున్నారు.  ఐదో అంతస్తులో  వేలంపాట నిర్వహించగా ఇప్పటికే అనేక సంవత్సరాలుగా కొండపై వ్యాపారాలు చేస్తున్నవారు ఎవరూ లో పాల్గొనక పోవడం గమనార్హం. కొత్తవారు ఎక్కువ అద్దెలు పెట్టి ఐదో అంతస్తులో షాపులు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు.
 
కింద షాపులకు రూ.78 వేల అద్దె....
కొండ దిగువన నిర్మించి ఇచ్చే షాపులకు రూ.78 వేలు వరకు అద్దె నిర్ణయిస్తామని ఈవో చెప్పడంతో వ్యాపారస్తులు  అంగీకరించడం లేదని తెలిసింది. అక్కడ వ్యాపారం ఉండదని అందువల్ల అద్దెలు తగ్గించాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్ణయం ఎలా ఉంటుందనేది వేచిచూడాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement