మూడు రోజులు పాటు శాకాంబరీదేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ
- 45 వేల మందికిపైగా అమ్మవారిని దర్శించుకున్న భక్తులు
- ఘనంగా ముగిసిన శాకాంబరి ఉత్సవాలు
విజయవాడ : కనకదుర్గ దేవస్థానంలో శాకాంబరీ ఉత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. మూడు రోజులపాటు శాకాంబరీదేవిగా భక్తులకు దర్శనం ఇచ్చిన అమ్మవారికి ఈ రోజు ఆలయ పండితులు పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వేదమంత్రాలతో, మంగళవాయిద్యాల నడుమ నిర్వహించిన పూర్ణాహుతి పూజా కార్యక్రమంలో ఈఓ ఎ. సూర్యకుమారి దంపతులు పాల్గొన్నారు.
మూడు రోజులపాటు నిర్వహించిన శాకాంబరి ఉత్సవాలకు 45 వేల మందికిపైగా భక్తులు దర్శించుకున్నారని అధికారులు వెల్లడించారు. శాకాంబరి ఉత్సవాలు చివరి రోజు గురుపౌర్ణమి కూడా కలిసి రావడంతో భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడింది.