ఇన్‌ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య | Informer assassination under the guise of tribals | Sakshi
Sakshi News home page

ఇన్‌ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య

Published Sat, Aug 23 2014 12:28 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM

Informer assassination under the guise of tribals

  • కిల్లంకోట ప్రాంతంలో మావోయిస్టుల ఘాతుకం?
  • పాడేరు : విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం కిల్లంకోట కాలనీ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం గిరిజనుడు బి.బాలకృష్ణను పోలీస్ ఇన్‌ఫార్మర్ నెపంతో మావోయిస్టులు కాల్చి చంపారు. ఈ సంఘటనతో మారుమూల గిరిజన గ్రామాల్లో భయాందోళనలు చోటుచేసుకున్నాయి.   రహదారి లేని మారుమూల ప్రాంతం కావడంతో పూర్తి సమాచారం తెలియరాలేదు.

    బాలకృష్ణకు పోలీసులతో సంబంధాలు ఉన్నాయనే మావోయిస్టులు అతనిని హతమార్చారని అక్కడి వారు జి.మాడుగుల మండలకేంద్రానికి సమాచారం చేరవేశారు. రాత్రి సమయం కావడం, ఒడిశా సరిహద్దులో ఉండడంతో అక్కడి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో పోలీసు అధికారులు కూడా పూర్తి వివరాలు చెప్పలేకపోతున్నారు. సమాచారం సేకరణలో నిమగ్నమయ్యారు. ఇటీవల మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయని ఊపిరి పీల్చుకున్న తరుణంలో దళసభ్యులు గిరిజనుడిని హత్య చేయడంతో ఒక్కసారిగా మన్యం ఉలిక్కిపడింది.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement