వివాహం జరిపిస్తున్న విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు
టెక్కలి: టెక్కలిలో విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన నిరుపేద యువతి శ్రీదేవి వివాహానికి విశ్వబ్రాహ్మణులంతా అండగా నిలిచారు. తల్లిదండ్రుల పాత్రలో కన్యాదానం ఇచ్చారు.. కుటుంబ సభ్యులు మాదిరిగా హాజరై బ్రాహ్మణ యువకునితో వైభవంగా వివాహం జరిపించారు. వివరాల్లోకి వెళితే.. టెక్కలిలోని రెడ్డికవీధికి చెందిన లక్కోజు నీలవేణి, కుమార్తె శ్రీదేవిలు నిరుపేదలు.
దీంతో శ్రీదేవికి వివాహం చేసే బాధ్యతను పట్టణంలోని విశ్వబ్రాహ్మణులంతా వారి భుజాన వేసుకున్నారు. ఇదే సందర్భంలో హైదరాబాద్‌లో ఉంటున్న లోకేశ్‌శర్మ అనే బ్రాహ్మణ యువకుడు పేదింటి యువతిని వివాహం చేసుకునేందుకు ఆలోచన చేశాడు.
ఈ క్రమంలో టెక్కలి మండలం సుఖదేవ్‌పేట గ్రామానికి చెందిన బొడ్డు ఢిల్లేశ్వరరావుకు పరిచయం కలిగిన వ్యక్తులు హైదరాబాద్‌లో ఉండడంతో వారి ద్వారా శ్రీదేవి గురించి తెలుసుకున్నాడు. టెక్కలిలో విశ్వబ్రాహ్మణ సంఘాన్ని సంప్రదించి వివాహానికి సిద్ధమయ్యాడు. దీంతో బుధవారం టెక్కలి లక్ష్మీ నృసింహా స్వామి ఆలయంలో వీరి వివాహం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment