కంబాలచెరువు (రాజమండ్రి) : ఇంటర్మీడియట్ పరీక్షలు జిల్లాలో బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో సెకండ్ లాంగ్వేజ్‌లో పేపర్- 1 విభాగంలో తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 49,807 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 47,269 మంది హాజరయ్యూరు. 2,538 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలోని మొత్తం 128 కేంద్రాల్లో ఎక్కడా మాల్‌ప్రాక్టీస్, ఆలస్యంగా పరీక్షకు వచ్చిన ఉదంతాలు నమోదు కాలేదు. పరీక్షా కేంద్రాలవద్ద 144 సెక్షన్ విధించారు. ఉదయం 8 గంటలకే కేంద్రాలవద్ద సందడి నెలకొంది. విద్యార్థులు ముందుగానే వచ్చి వారికి కేటాయించిన రూమ్ నంబర్లను హాల్ టిక్కెట్లతో పోల్చిచూసుకున్నారు. పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు ముగిసింది. పరీక్షా కేంద్రాలకు చేరువలోని జిరాక్స్ సెంటర్లను మూసివేశారు.
పరీక్ష రాసిన 22 మంది అంధ విద్యార్థులు
జిల్లావ్యాప్తంగా 22 మంది అంధ విద్యార్థులు బ్రెయిలీ లిపిలోఇంటర్ పరీక్షలు రాసారు. వీరితో పాటు వికలాంగ విద్యార్థులు 79 మంది, చెవిటి, మూగ విద్యార్థులు 44 మంది, మతిస్థిమితం లేని విద్యార్థులు ముగ్గురు పరీక్షలను రాసారు. వీరందరికీ వ్యక్తిగత సహాయకులను అనుమతించారు. మూడు సిట్టింగ్ స్వ్కాడ్స్, నాలుగు ఫ్లైయింగ్ స్వ్కాడ్స్‌తో పాటు హైపవర్ టీం, ఆర్‌ఐవో టీం, డీవీఈవో టీంలు పరీక్షా కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాయి. 128 మంది చీఫ్ సూపరిండెండెంట్‌లు, 128 మంది డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు పరీక్షల నిర్వహణలో పాలు పంచుకున్నారు. రాజమహేంద్రవరం దానవాయిపేటలో ఒకే ప్రాంతంలో నాలుగు పరీక్ష కేంద్రాలు ఉండడంతో ఉదయం సుమారు గంటసేపు ట్రాఫిక్ స్తంభించింది. దీంతో విద్యార్థులు అవస్థలు పడ్డారు.
టెన్షన్‌తో టెన్త్ హాల్ టిక్కెట్
సామర్లకోట : ఎంత కష్టపడి చదివినా, ఎంత ఆత్మవిశ్వాసంతో ఉన్నా.. పిల్లలకు పబ్లిక్ పరీక్షలంటేనే ఏదో కలవరం. తప్పనిసరి తడబాటు. అదిగో.. అలాంటి మానసిక స్థితితో సతమతమయ్యే కాబోలు.. ఓ ఇంటర్ విద్యార్థి నిరుటి పదో తరగతి పరీక్షల హాల్ టిక్కెట్‌తో సామర్లకోట ప్రగతి కళాశాలలోని పరీక్షా కేంద్రానికి వచ్చాడు. ప్రశ్నాపత్రం ఇచ్చే సమయంలో ఆ హాల్ టిక్కెట్‌ను పరిశీలించిన ఇన్విజిలేటర్ అది టెన్త్ హాల్ టిక్కెట్టని, ఇంటర్ హాల్‌టిక్కెట్ ఏదని ప్రశ్నించగా ఆ విద్యార్థి బిత్తరపోరుు, నిస్సహాయంగా ఉండిపోయూడు. అరుుతే పరీక్షా కేంద్రం అధికారులు విద్యార్థికి నష్టం కలుగకుండా ఆన్‌లైన్‌లో అప్పటికప్పుడు హాల్‌టిక్కెట్ ను డౌన్‌లోడ్ చేసి ఇచ్చి పరీక్ష రాసే అవకాశం కల్పించారు.
ప్రశాంతంగా ప్రారంభం
Published Thu, Mar 3 2016 2:09 AM | Last Updated on Sun, Sep 3 2017 6:51 PM
Advertisement
Advertisement