ఇంకొల్లు, న్యూస్‌లైన్: అవినీతి ఆరోపణలెదుర్కొంటున్న ఇంకొల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్లె చెంచుపున్నయ్య వ్యవహారంపై ఉప విద్యాశాఖాధికారి బెజ్జం విజయభాస్కర్ మంగళవారం విచారణ చేపట్టారు. చెంచుపున్నయ్య ఇన్‌చార్జి విద్యాశాఖాధికారిగా విధులు నిర్వర్తించినప్పుడు 2009 నుంచి 2012 వరకు విద్యాశాఖకు చెందిన రూ. 3 లక్షలను వ్యక్తిగత ఖర్చులకు వాడుకున్నారని తెలిపారు. అయితే రెండున్నర సంవత్సరాల తర్వాత తిరిగి చెల్లించినట్లు తన పరిశీలనలో తేలిందన్నారు.
అలాగే చింతలపాలెం ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన రూ. 15 వేలు డ్రా చేసుకొని ఒక ఏడాది తర్వాత తిరిగి చెల్లించారని.. కొత్తపాలెం ప్రాథమిక పాఠశాల నగదు పుస్తకాలు మాయమయ్యాయని చెప్పారు. 2009లో ఎమ్మార్సీలో డ్రా చేసిన నగదు వివరాలు, జమా ఖర్చులు పుస్తకాల్లో నమోదు కాలేదని చెప్పారు. భీమవరం యూపీ పాఠశాల ఉపాధ్యాయుడు సీహెచ్ శ్రీనివాసరావు జీతాన్ని కూడా సొంతానికి వాడుకున్నట్లు వెల్లడైందని వివరించారు. పూర్తి వివరాలతో ఆర్జేడీకి నివేదిక అందజేస్తామని తెలిపారు. అనంతరం స్థానిక భవిత విద్యావనరుల కేంద్రాన్ని పరిశీలించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఏర్పాటు చేసిన సౌకర్యాలపై ఆరా తీశారు.
ఇద్దరికి మెమోలు
మండల పరిధిలోని పావులూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పర్చూరు ఉప విద్యాశాఖాధికారి బి.విజయభాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఉపాధ్యాయులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులు సమయ పాలన పాటించడంలేదనే విషయాన్ని గ్రామస్తులు తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. అనంతరం పావులూరు ఎల్ ఈ పాఠశాలను తనిఖీ చేశారు. హెచ్‌ఎం.. సీఎల్ ఇవ్వకుండా సెలవు తీసుకున్నారని.. మరో ఉపాధ్యాయుడు రాకపోయినప్పటికీ.. సీఎల్ లేనప్పటికీ సీఎల్ పెట్టినట్లు రికార్డుల్లో ఉందన్న విషయాన్ని గుర్తించారు.
మధ్యాహ్న భోజన పథకం వివరాలు నమోదు చేయలేదని.. ఈ ఏడాది సీఎల్ రిజిస్టర్ లేదన్నారు. విద్యార్థుల తల్లి దండ్రుల పేర్లకు సంబంధించిన రికార్డులు కూడా లేవన్నారు. దీనిపై ప్రధానోపాధ్యాయుడు రత్నాకర్, ఉపాధ్యాయుడు ధనుంజయలకు మెమోలు జారీ చేశామని విజయభాస్కర్ వివరించారు. ఆయన వెంట విద్యాశాఖాధికారి గోరంట్ల హరిబాబు, సిబ్బంది ఉన్నారు.
హెచ్‌ఎం అవినీతి ఆరోపణలపై విచారణ
Published Wed, Feb 12 2014 5:38 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement