‘ఇరాక్’ కలవరం | iraq issue | Sakshi
Sakshi News home page

‘ఇరాక్’ కలవరం

Published Fri, Jun 20 2014 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 9:04 AM

‘ఇరాక్’ కలవరం

‘ఇరాక్’ కలవరం

- అక్కడ మనోళ్లంతా క్షేమం వారితో ఎప్పటికప్పుడు
- ఫోన్‌లో మాట్లాడుతున్న కుటుంబ సభ్యులు
- ఎలాంటి ఇబ్బందులు లేవని సమాచారం

అత్తిలి: ఇరాక్‌లో తలెత్తిన అంతర్యుద్ధం మన జిల్లా వాసులనూ కలవరపాటుకు గురిచేస్తోంది. జీవనోపాధి కోసం ఆ దేశానికి వెళ్లిన వారంతా అక్కడ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారోనని వారి కుటుంబ సభ్యులు, ఆయూ గ్రామాల వారు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 50 మంది జీవనోపాధి కోసం ఇరాక్ వెళ్లినట్టు తెలుస్తోంది. మిలిటెంట్ల దాడులతో అట్టుడికిపోతున్న ఆ దేశంలో చిక్కుకుపోరున జిల్లా వాసులంతా క్షేమంగానే ఉన్నట్టు సమాచారం అందింది. వారితో కుటుంబ సభ్యులు, బంధువులు ఇక్కడినుంచి ఎప్పటికప్పుడు ఫోన్‌లో మాట్లాడుతూ వారి యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు.

మిలి టెంట్లు బాంబు దాడులకు తెగబడుతున్న ప్రాంతానికి 400 కిలోమీటర్ల దూరంలో తాము ఉన్నామని, తమకెలాంటి ఆపద లేదని అక్కడ చిక్కుకున్న వారంతా తమ వారికి సమాచారం ఇచ్చారు. స్వల్ప ఇబ్బందులు తప్ప తమకెలాంటి సమస్య లేదని చెప్పటంతో కుటుం బ సభ్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అరుుతే, మిలిటెంట్లు ఏ క్షణంలో, ఎక్కడ, ఎలాంటి ఘాతుకానికి పాల్పడతారోననే భయం ఇక్కడి వారిని వెన్నాడుతోంది. 40మంది భారతీయులను మిలిటెంట్లు కిడ్నాప్ చేయడం కలవరానికి గురిచేస్తోంది. అక్కడ చిక్కుకుపోరుున వారు స్వదేశాలకు తిరిగి వచ్చే పరిస్థితి ప్రస్తుతానికి లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

తిరిగొచ్చేందుకు ప్రయత్నాలు
ఇటీవల కాలంలో ఇరాక్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలతో అక్కడ పనిచేస్తున్న జిల్లా వాసులు స్వగ్రామాలకు తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, వారితో పని చేరుుంచుకుంటున్న కంపెనీలు ఇందుకు అంగీకరించడం లేదు. దీంతో అక్కడ చిక్కుకుపోరుున వారంతా ఇబ్బందులు పడుతున్నారు. వారిని స్వగ్రామాలకు రప్పించే ఏర్పాటు చేయూల్సిందిగా వారి కుటుంబ సభ్యులు ఏజెంట్లతో సంప్రదింపులు జరుపుతున్నారు.
 
అత్తిలి మండలం నుంచి 40 మంది

ఏజెంట్లు చెబుతున్న సమాచారం ప్రకారం జీవనోపాధి కోసం అత్తిలి మండలం నుంచి ఇరాక్ దేశానికి సుమారు 40 మంది వెళ్లారు. వారిలో ఉనికిలికి చెందిన 20 మంది, ఆరవల్లికి చెందిన ఐదుగు రు, మంచిలికి చెందిన ముగ్గురు, వరిఘేడుకు చెం దిన ఆరుగురు, పాలికి చెందిన ముగ్గురు ఉన్నారు.
 
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..
ఇక్కడ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోంది. మా ఊళ్లో ఉపాధి దొరక్క ఏడాదిన్నర క్రితం ఇరాక్ వచ్చాను. నిర్మాణ రంగానికి చెందిన కంపెనీలో హెల్పర్‌గా పనిచేస్తున్నాను. గల్ఫ్‌లోని ఇతర దేశాలకంటే ఇరాక్‌లో జీతాలు బాగుంటాయి. అందుకే ఇక్కడికొచ్చాను. అయితే కొన్ని నెలలుగా ఇక్కడ జీతాలు ఇవ్వటం లేదు. కంపెనీ వారిని, నన్ను ఇరాక్ పంపించిన బ్రోకర్‌ని కలుస్తున్నాను. నన్ను ఇంటికి పంపించెయ్యమని అడుగుతున్నా స్పందించడం లేదు.

మేం ఇరాక్‌లోని శివారు ప్రాంతంలో ఉండటం వల్ల ప్రస్తుతానికి మాకెలాంటి ఇబ్బంది లేదు. అరుతే, కంపెనీల తీరు, భయానక వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ పనిచేసేందుకు అనుకూల వాతావరణం లేదు. అందువల్ల ఇక్కడి వాళ్లందరం స్వదేశానికి వచ్చేయాలనుకుంటున్నాం. సామాజికవేత్త పెంటపాటి పుల్లారావు దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లాం.
 - ఇరాక్ నుంచి లక్కవరపు సురేష్, ఉనికిలి వాసి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement