కోరుట్ల రూరల్, న్యూస్‌లైన్ : ఉపాధి హామీలో అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. చేసిన పనికి ప్రభుత్వం కూలీలకు డబ్బులు విడుదల చేసినా వాటిని పంపిణీ చేసే కంపెనీ ప్రతినిధుల నిర్వాకం కారణంగా లబ్ధిదారులకు అందలేదు. మండలంలో ఉపాధి హామీ కూలీలకు గత ఏడాది ఏప్రిల్, మేలో నిర్వహించిన ఈజీఎస్ పని బాపతు రూ.27లక్షలు ఇప్పటికీ అందకపోవడంతో ఫినో కంపెనీ ప్రతినిధులపై కేసులు నమోదు చేయించాలని అడిషనల్ పీడీ శ్రీనివాస్ ఈజీఎస్ అధికారులను ఆదేశించారు.
మండల కేంద్రంలోని ఎంపీడీవో కా ర్యాలయ ఆవరణలో ఉపాధి హామీ అదనపు పీడీ శ్రీనివాస్ అధ్యక్షతన ఈజీఎస్ సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం బుధవారం నిర్వహించారు.
మూడు రోజులుగా గ్రామాల్లో ఈజీఎస్ తని ఖీ బృందాలు తనిఖీలు నిర్వహించి సిద్ధం చేసిన నివేదికలు చదివి వినిపిం చారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ ప నులు, కూలీలకు డబ్బులు పంపిణీ, పిం చన్ల పంపిణీ, వ్యవహారాల్లో రూ.27లక్షలు అక్రమాలు జరిగినట్టు తనిఖీ బృం దాలు గుర్తించాయి. మండలంలోని 15 గ్రామాల్లో గత సంవత్సరం ఫిబ్రవరి 1 నుంచి నవంబర్ 30 వరకు రూ.1కోటి 27లక్షల పనులు నిర్వహించారు. ఈ డ బ్బులు ప్రభుత్వం విడుదల చేసింది. కా గా పనులకు సంబంధించిన డబ్బులను ఫినో కంపెనీ ద్వారా కూలీలకు పంపిణీ చేస్తున్నారు. ఇందులో రూ.1కోటి 27లక్షలకు రూ.1కోటి మాత్రమే కూలీలకు పం పిణీ చేయగా ఏప్రిల్, మే నెలలకు సం బంధించిన డబ్బులు రూ.27లక్షలు వారి కి అంద నట్టు తనిఖీల్లో వెల్లడైంది. దీంతో ఫినో కంపెనీ మండల కో-ఆర్డినేటర్ వేణుగోపాల్, సంబంధిత సిబ్బందిపై కేసులు నమోదు చేయించాలని ఎంపీడీవో ప్రభు, ఈజీఎస్ ఏపీవో కొమురయ్యను అదేశించారు.
అలాగే ఐఎస్‌ఎల్ పథకంలో 580 మరుగుదొడ్ల గుంతలు తీయగా ఒక్కో లబ్ధిదారుడికి రూ.2వేల చొప్పున మంజూరై పే స్లిప్పులు జారీ చేసినా ఇంకా లబ్ధ్దిదారులకు మొత్తం అందలేదు. పలుగ్రామాల్లో టేకుమొక్కల పెంపకంలో ఫీల్డు అసిస్టెంట్లు అక్రమాలకు పాల్పడగా పింఛన్ల పంపిణీలో కూడా అవకతవకలు జరిగినట్టు తేలింది. 15 గ్రామాల్లో పనుల కొలతల్లో రూ.10,438 మేర పొరపాట్లు జరిగినట్లు గుర్తించి రికవరికీ ఆదేశించారు. కార్యక్రమంలో డీవీఓ వెంకటేశ్వర్లు, క్యూసీ అధికారి సంజీవ్‌రావు, ఏపీడీ పురుషోత్తం, సోషల్‌ఆడిట్ అధికారి గంప సత్యనారాయణ, ఈజీఎస్ ఎపీఓ కొమురయ్య, ఐకేపీ ఎపీఎం నరహరి, అన్ని గ్రామాల సర్పంచ్‌లు, ఫీల్డ్‌అసిస్టెంట్లు, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
‘ఉపాధి’లో అక్రమాలు
Published Thu, Jan 9 2014 6:08 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM
Advertisement
Advertisement