ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్ : జిల్లాలో వివిధ రకాల పింఛన్లు పొందుతున్న వారు మొత్తం 2,28,861 మంది ఉండగా, వారిలో 62,882 మందికి ఆధార్ కార్డులు లేనట్లు గుర్తించామని పింఛన్ల పంపిణీ అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి (ఏపీవో) కిషన్ పేర్కొన్నారు. ఆధార్ కార్డులు లేని పింఛన్‌దారుల యూఐడీ నంబర్లను ఏపీ ఆన్‌లైన్‌లోని ఎస్‌ఎస్‌పీ సర్వర్‌కు అప్‌లోడ్ చేయాలని మండల కార్యాలయాల్లోని కంప్యూటర్ ఆపరేటర్లకు సూచించారు. ఆ మేరకు జిల్లాలోని మండల కార్యాలయాల్లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లకు స్థానిక టీటీడీసీలో శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీవో మాట్లాడుతూ ఆధార్ కార్డులు లేని పింఛన్‌దారులకు పింఛన్ పంపిణీని జనవరి నుంచి పోస్టల్‌శాఖ నిలిపివేసినట్లు తెలిపారు.
అటువంటి పింఛన్‌దారులను ఇప్పటికే గుర్తించామని, వారి వేలిముద్రలు, ఫొటోలను మండల కో ఆర్డినేటర్ల ద్వారా సేకరించి ఏపీ ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని చెప్పారు. దీనివల్ల ఆధార్‌కార్డులు వచ్చేంత వరకూ కూడా వారికి పింఛన్ అందుతుందని వివరించారు. అదేవిధంగా ధ్రువీకరణ పరీక్షల నిమిత్తం సదరమ్ క్యాంపులకు రానివారు జిల్లాలో 5,800 మంది ఉన్నారని, వారంతా వెంటనే క్యాంపులకు వచ్చి ధ్రువీకరణ పత్రాలు పొందాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లాలోని 56 మండలాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు, 8 మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న పెన్షన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆధార్‌కార్డులు లేని పెన్షన్‌దారులు 62,882 మంది
Published Sat, Jan 25 2014 6:06 AM | Last Updated on Wed, Apr 3 2019 9:21 PM
Advertisement
Advertisement