చంద్రగిరి , న్యూస్‌లైన్:
హిందువుల మనోభావాలు దెబ్బతినేలా తిరుపతి పరిసర ప్రాం తంలో ఏర్పాటు చేసిన ఇస్లామిక్ కళాశాలను వెంటనే తొలగించాలని విజయవాడకు చెందిన శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ డిమాండ్ చేశారు. చంద్రగిరి మండలం తొండవాడ వద్ద హీరా సంస్థ నిర్మిస్తున్న ఇస్లామిక్ కళాశాల ప్రాంతంలో శుక్రవారం నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా శివస్వామి మాట్లాడుతూ ఉగ్రవాదుల దుశ్చర్యలో భాగమే ఇస్లామిక్ కళాశాల ఏర్పాటు అని ఆరోపించారు. దేశంలో మరెక్కడా స్థలం లేనట్టు ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుపతి ప్రాంతంలో కళాశాలను ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. కళాశాల నిర్మాణానికి నిధుల సేకరణ, విధివిధానాలు, విద్యార్థుల వివరాలను గోప్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోందన్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ర్యాలీ నిర్వహించడంతో చంద్రగిరి, తిరుపతి రూరల్ సీఐలు నాగభూషణం, సుబ్రమణ్యంతో పాటు నలుగురు ఎస్‌ఐలు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూ జనజాగృతి సంస్థ అధికార ప్రతినిధి ఆకుల కృష్ణకిషోర్, దళిత హిందూ పరిరక్షణ అధ్యక్షులు బాపూజీ, హిందూ ధర్మ చైతన్య సంఘం నాయకుడు బీవీ.రత్నంశెట్టి, జయచంద్రారావు, తొండవాడ సర్పంచ్ సిద్దముని, పీ.మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హిందూ జన గర్జనను విజయవంతం చేయండి
తిరుపతిలోని ఇందిరా మైదానంలో ఈనెల 20వ తేదీనిర్వహించే హిందూ జన గర్జన సభను విజయవంతం చేయాలని విజయవాడకు చెందిన శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామీజీ కోరారు. వంద మంది పీఠాధిపతులతో సభ జరుపుతున్నట్టు చెప్పారు.
ఇస్లామిక్ కళాశాల ఏర్పాటు ఉగ్రవాదుల కుట్రలో భాగమే
Published Sat, Dec 14 2013 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 1:34 AM
Advertisement
Advertisement