islamic college
-
అమ్మాయిల పరుగుపై నిషేధం
మెల్బోర్న్: ఆధునిక కాలంలోనూ విద్యాసంస్థలకు కూడా మూడనమ్మకమత మౌఢ్యాలు తప్పడం లేదు. ఆస్ట్రేలియాలోని ఓ ఇస్లామిక్ కాలేజీలో అమ్మాయిలకు పరుగు పోటీలను నిషేధించారు. వారు కన్యత్వాన్ని కోల్పోతారని ఉద్దేశంతోనే ఆ పని చేసినట్లు ఏకంగా ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ఈ పని చేశాడు. దీంతో ఇప్పుడతనిపై కేసు నమోదైంది. ట్రుగానినా సూబర్బ్లోని అల్ తఖ్వా అనే కాలేజీలో ఉన్నపలంగా అమ్మాయిలెవరూ ఆటల్లో పాల్గొనవద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో అదే కళశాలలో గతంలో పనిచేసిన ఓ ఉపాధ్యాయుడు విక్టోరియన్ రిజిస్ట్రేషన్ అండ్ క్వాలిఫికేషన్స్ అథారిటీ (వీఆర్ క్యూఏ)కి ఈ విషయంపై ఫిర్యాదు చేశాడు. ప్రిన్సిపాల్ అమ్మాయిల విషయంలో వివక్ష చూపుతున్నాడని, వారిని తప్పుడు ఉద్దేశాలతో ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో విచారణ చేపట్టిన అథారిటీ అసలు విషయం రాబట్టింది. కళశాల ప్రిన్సిపాల్ ఒమర్ హల్లాక్ మూఢ మత విశ్వాసాలకు బద్ధుడై ఉండి అమ్మాయిలు పరుగెత్తితే వారి కన్యత్వాన్ని కోల్పోతారని, సాకర్ వంటి ఆటలు ఆడటం వల్ల సంతాన లేమి సమస్యలు కూడా వస్తాయని భావించి వారిని ఆటల్లో పాల్గొనకుండా నిషేధం విధించాడని తెలిసింది. దీంతో అతడిని నిందితుడిగా చేర్చారు. -
తిరుపతిని మరో అయోధ్యగా మారుస్తారా?
విరసం, పౌరహక్కుల సంఘం నేతల ప్రశ్న చంద్రగిరి, న్యూస్‌లైన్: ఇస్లామిక్ కళాశాలను కూల్చేయాలని కోరుతున్నవారితో లౌకికవాదానికి ముప్పేనని విప్లవ రచయితల సంఘం(విరసం), పౌరహక్కుల సంఘం నేతలు పేర్కొన్నారు. మతోన్మాదుల వల్ల ప్రశాంతంగా ఉన్న తిరుపతిని మరో అయోధ్యగా మారుస్తారా అని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలో హీరా సంస్థ ఏర్పాటు చేసిన ఇస్లామిక్ కళాశాలపై పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఆదివారం విరసం రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మి, సభ్యులు రవి, బాబ్జి, పౌరహక్కుల సంఘం సభ్యులు క్రాంతి చైతన్య, లత, రఘు, కుమార్ కళాశాలను సందర్శించారు. వరలక్ష్మి మాట్లాడుతూ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారిని అన్ని మతాల వారూ దర్శించుకుంటున్నారని, అలాంటి ప్రాంతంలో కొందరు మతవాదుల కారణంగా విద్వేషాలు రగిలే ప్రమాదం ఉందన్నారు. హిందువులకు వేద పాఠశాలలు ఎంత ప్రాధాన్యమో ముస్లింలకు మదర్సాలు అంత ప్రాధాన్యమన్నారు. సభ్యులు రవి, బాబ్జి మాట్లాడుతూ కశాళాల నిర్మాణంలో లోపాలు ఉంటే చర్యలు తీసుకునేందుకు చట్టాలు ఉన్నాయన్నారు -
ఇస్లామిక్ కళాశాల ఏర్పాటుపై ఆగ్రహం
భీమవరం అర్బన్, న్యూస్‌లైన్ : తిరుపతిలో అంతర్జాతీయ ఇస్లామిక్ కళాశాలను ఏర్పాటు చేయడంపై ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని నిరసిస్తూ స్థానిక ప్రకాశంచౌక్‌లో గురువారం రాస్తారోకో నిర్వహించాయి. ఆర్ఎస్ఎస్ నాయకులు గంటా కృష్ణహరి, వీహెచ్‌పీ నాయకులు వబిలిశెట్టి శ్రీవెంకటేశ్వర్లు, భజరంగ్‌దళ్ నాయకులు వేణుగోలపారాజు మాట్లాడుతూ హిందువుల పుణ్య స్థలమైన తిరుపతిలో అక్రమంగా ఇస్లామిక్ కళాశాలను నిర్మిస్తే అధికారులు, ప్రజాప్రతినిధు లు, టీటీడీ ట్రస్టు బోర్డు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. దేశంలో అనేక ప్రాంతాలు ఉండగా తిరుపతిలోనే కళాశాలను ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. దీనిపై విచారణ చేసి కళాశాలను వెంటనే కూల్చివేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ధర్మ రక్షా వేదిక పట్టణ అధ్యక్షుడు పులఖండం కోటేశ్వరరావు, ధర్మ ప్రచార పరిషత్ జిల్లా అధ్యక్షుడు తోరం సూర్యనారాయణ, బీజేపీ పట్ణణ అధ్యక్షుడు అరసవల్లి సుబ్రహ్మణ్యం, కేవీ రమేష్, వానపల్లి సూర్యప్రకాశరావు, పి.లక్ష్మణవర్మ, కఠారి వెంకటేశ్వరరావు, కొమ్ము శ్రీనివాస్, బి.శ్రీనివాస్, జి.కృష్ణవేణి, గన్నపురెడ్డి గోపాలకృష్ణ పాల్గొన్నారు. -

ఇస్లామిక్ కళాశాల ఏర్పాటు ఉగ్రవాదుల కుట్రలో భాగమే
చంద్రగిరి , న్యూస్‌లైన్: హిందువుల మనోభావాలు దెబ్బతినేలా తిరుపతి పరిసర ప్రాం తంలో ఏర్పాటు చేసిన ఇస్లామిక్ కళాశాలను వెంటనే తొలగించాలని విజయవాడకు చెందిన శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ డిమాండ్ చేశారు. చంద్రగిరి మండలం తొండవాడ వద్ద హీరా సంస్థ నిర్మిస్తున్న ఇస్లామిక్ కళాశాల ప్రాంతంలో శుక్రవారం నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా శివస్వామి మాట్లాడుతూ ఉగ్రవాదుల దుశ్చర్యలో భాగమే ఇస్లామిక్ కళాశాల ఏర్పాటు అని ఆరోపించారు. దేశంలో మరెక్కడా స్థలం లేనట్టు ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుపతి ప్రాంతంలో కళాశాలను ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. కళాశాల నిర్మాణానికి నిధుల సేకరణ, విధివిధానాలు, విద్యార్థుల వివరాలను గోప్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోందన్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ర్యాలీ నిర్వహించడంతో చంద్రగిరి, తిరుపతి రూరల్ సీఐలు నాగభూషణం, సుబ్రమణ్యంతో పాటు నలుగురు ఎస్ఐలు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూ జనజాగృతి సంస్థ అధికార ప్రతినిధి ఆకుల కృష్ణకిషోర్, దళిత హిందూ పరిరక్షణ అధ్యక్షులు బాపూజీ, హిందూ ధర్మ చైతన్య సంఘం నాయకుడు బీవీ.రత్నంశెట్టి, జయచంద్రారావు, తొండవాడ సర్పంచ్ సిద్దముని, పీ.మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హిందూ జన గర్జనను విజయవంతం చేయండి తిరుపతిలోని ఇందిరా మైదానంలో ఈనెల 20వ తేదీనిర్వహించే హిందూ జన గర్జన సభను విజయవంతం చేయాలని విజయవాడకు చెందిన శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామీజీ కోరారు. వంద మంది పీఠాధిపతులతో సభ జరుపుతున్నట్టు చెప్పారు.