విరసం, పౌరహక్కుల సంఘం నేతల ప్రశ్న
చంద్రగిరి, న్యూస్‌లైన్: ఇస్లామిక్ కళాశాలను కూల్చేయాలని కోరుతున్నవారితో లౌకికవాదానికి ముప్పేనని విప్లవ రచయితల సంఘం(విరసం), పౌరహక్కుల సంఘం నేతలు పేర్కొన్నారు. మతోన్మాదుల వల్ల ప్రశాంతంగా ఉన్న తిరుపతిని మరో అయోధ్యగా మారుస్తారా అని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలో హీరా సంస్థ ఏర్పాటు చేసిన ఇస్లామిక్ కళాశాలపై పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఆదివారం విరసం రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మి, సభ్యులు రవి, బాబ్జి, పౌరహక్కుల సంఘం సభ్యులు క్రాంతి చైతన్య, లత, రఘు, కుమార్ కళాశాలను సందర్శించారు.
వరలక్ష్మి మాట్లాడుతూ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారిని అన్ని మతాల వారూ దర్శించుకుంటున్నారని, అలాంటి ప్రాంతంలో కొందరు మతవాదుల కారణంగా విద్వేషాలు రగిలే ప్రమాదం ఉందన్నారు. హిందువులకు వేద పాఠశాలలు ఎంత ప్రాధాన్యమో ముస్లింలకు మదర్సాలు అంత ప్రాధాన్యమన్నారు. సభ్యులు రవి, బాబ్జి మాట్లాడుతూ కశాళాల నిర్మాణంలో లోపాలు ఉంటే చర్యలు తీసుకునేందుకు చట్టాలు ఉన్నాయన్నారు
తిరుపతిని మరో అయోధ్యగా మారుస్తారా?
Published Mon, Jan 6 2014 2:10 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM
Advertisement