ఇస్లామిక్ వర్సిటీని కూలగొడతాం | islamic university collapse in tirupati, swaroopanendhra saraswathi warning | Sakshi
Sakshi News home page

ఇస్లామిక్ వర్సిటీని కూలగొడతాం

Published Mon, Feb 10 2014 3:05 AM | Last Updated on Sat, Sep 2 2017 3:31 AM

ఇస్లామిక్  వర్సిటీని కూలగొడతాం

ఇస్లామిక్ వర్సిటీని కూలగొడతాం

* శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి హెచ్చరిక

పెందుర్తి, న్యూస్‌లైన్: తిరుపతిలో నిర్మించిన ఇస్లామిక్ యూనివర్సిటీని ప్రభుత్వగానీ, టీటీడీ గానీ తక్షణమే స్వాధీనం చేసుకోవాలని శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి డిమాండ్ చేశారు. లేకపోతే  త్వరలో  యూనివర్శిటీని కూలగొట్టడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలోని శారదాపీఠంలో ఆదివారం ఉత్తరాంధ్ర సాధుపరిషత్, హిందూ ధర్మ రక్షణ సమితి సభలో స్వామిజీ మాట్లాడారు.
 
 ప్రభుత్వాలు హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నాయని ఆరోపించారు.  పవిత్ర టీటీడీ దేవస్థానం భూమిని అన్యమతస్థులకు ఇవ్వడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. వర్సిటీ భూమి వివాదం కోర్టు పరిధిలో ఉన్నందున మార్చి10 వరకు వేచి చూస్తామన్నారు. అప్పటికీ సరైన న్యాయం జరగకపోతే పీఠాధిపతులు, మఠాధిపతులు, సాధు సంతులను కలుపుకొని హిందూధర్మం పరిరక్షణ కోసం ఉద్యమం చేపడతామని పేర్కొన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా గవర్నర్, ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని కోరారు. సభలో శ్రీనివాసనందస్వామి, సమతానందస్వామి తదితరులు పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement