10 మంది వీఆర్‌ఓలకు షోకాజ్ నోటీసులు
తెర్లాం రూరల్: నీటి తీరువా వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని పార్వతీపురం సబ్ కలెక్టర్ శ్వేతా మహంతి హెచ్చరించారు. స్థానిక తహశీల్ధార్ కార్యాల యంలో గురువారం నీటితీరువా వసూళ్ల పై గ్రామ రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవెన్యూ గ్రామాల వారీగా నీటి తీరువాల లక్ష్యం, వసూళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నీటి తీరువా వసూళ్లలో నిర్లక్ష్యం వహించిన 10 మంది వీఆర్‌ఓలకు షోకా జ్ నోటీసులు జారీ చేశారు. తెర్లాంలోని ఇద్దరు వీఆర్‌ఓలు, ఉద్దవోలు, సుందరాడ, నెమలాం, కాగాం, అరసబలగ, కుసుమూరు, నందిగాం, గంగన్నపాడు గ్రామాల వీఆర్‌ఓలకు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మరిపి కృష్ణమూర్తి సబ్ కలెక్టర్ జారీ చేసిన షోకాజ్ నోటీసులు అందజేశారు.
పార్వతీపురం డివిజన్‌లో రూ.11.22 కోట్ల నీటితీరువా బకాయిలు..
పార్వతీపురం డివిజన్‌లో నీటితీరువా బకాయిలు 11.22 కోట్ల రూపాయలు ఉందని సబ్ కలెక్టర్ శ్వేతా మహంతి చెప్పారు. వీఆర్‌ఓల సమావేశం అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది డివిజన్‌లో రూ.కోటీ 66 లక్ష ల నీటితీరువా వసూళ్లు లక్ష్యం కాగా ఇం తవరకు రూ.24 లక్షలే వసూలయ్యూయని తెలిపారు. తెర్లాం మండలంలో రూ.48 లక్షలు లక్ష్యం కాగా ఇంతవరకు రూ.8 లక్షలు మాత్రమే వసూలైందని పేర్కొన్నారు. పార్వతీపురం డివిజన్‌లో ఐదు రేషన్ డీలర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వీటిని చనిపోయిన డీలర్ల వారసులతో భర్తీ చేయనున్నామని చెప్పారు. ఏడో విడత భూ పం పిణీకి అవసరమైన భూములు గుర్తిస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో తెర్లాం డిప్యూటీ తహశీల్దార్ రామస్వామి, ఆర్‌ఐ కృష్ణమూర్తి, సీనియర్ సహాయకుడు సన్యాసినాయుడు తదితరులు పాల్గొన్నారు.