మీడియాను తొక్కేస్తాననడం మంచిది కాదు: వెంకయ్య | it is not correct to oppress media, says venkaiah naidu | Sakshi
Sakshi News home page

మీడియాను తొక్కేస్తాననడం మంచిది కాదు: వెంకయ్య

Published Wed, Sep 10 2014 12:04 PM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM

మీడియాను తొక్కేస్తాననడం మంచిది కాదు: వెంకయ్య - Sakshi

మీడియాను తొక్కేస్తాననడం మంచిది కాదు: వెంకయ్య

మీడియా స్వేచ్ఛను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, మీడియాను తొక్కి పెడతాననడం మంచిది కాదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఒకవేళ ఏవైనా మీడియా సంస్థలు నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టప్రకారం నడుచుకోవాలని ఆయన సూచించారు. మరీ ఇబ్బంది అనిపిస్తే ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు చేయాలన్నారు. ప్రభుత్వం నడిపే పెద్దలకు సహనం అవసరమని, ప్రతిపక్షాలకు ప్రజలకు సముచిత స్థానం ఇస్తేనే ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందని వెంకయ్య నాయుడు తెలిపారు. తమకు గౌరవం ఇవ్వని మీడియాకు తాము ఎందుకు స్థానం ఇవ్వాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయనిలా చెప్పారు.

మరోవైపు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడితో సింగపూర్ ప్రతినిధుల బృందం భేటీ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్మార్ట్‌ సిటీల నిర్మాణానికి అక్కడి కంపెనీలు తమ ప్రతిపాదనలు ఇచ్చాయి. ఏపీతో పాటు.. హైదరాబాద్ చుట్టుపక్కల కూడా స్మార్ట్‌ సిటీల నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదనలను సమర్పించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement