సెప్టెంబరు 23. ఈ తేదీ కోసం నాలుగైదురోజుల నుంచి జిల్లావాసులు ఎదురుచూస్తున్నారు. తమ దర్యాప్తు పూర్తయిందని సీబీఐ ప్రత్యేక కోర్టుకు చెప్పడం, బెయిల్ కోసం వైఎస్ జగన్ పిటీషన్ దాఖలు చేయడం, విచారణ అనంతరం తీర్పును ఈ నెల 23కు సీబీఐ ప్రత్యేక కోర్టు వాయిదా వేయడ ంతో అందరూ బెయిల్‌పై కోటి ఆశలు పెట్టుకున్నారు.
సాక్షి, కడప:
సెప్టెంబరు 23. ఈ తేదీ కోసం నాలుగైదురోజుల నుంచి జిల్లావాసులు ఎదురుచూస్తున్నారు. తమ దర్యాప్తు పూర్తయిందని సీబీఐ ప్రత్యేక కోర్టుకు చెప్పడం, బెయిల్ కోసం వైఎస్ జగన్ పిటీషన్ దాఖలు చేయడం, విచారణ అనంతరం తీర్పును ఈ నెల 23కు సీబీఐ ప్రత్యేక కోర్టు వాయిదా వేయడ ంతో అందరూ బెయిల్‌పై కోటి ఆశలు పెట్టుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం 4.55 గంటల వరకూ టీవీలకు అతుక్కుపోయారు. 8 కంపెనీల్లో క్విడ్‌ప్రోకో లేదని సోమవారం ఉదయం సీబీఐ ప్రత్యేక మెమోను కోర్టుకు సమర్పించడంతో బెయిల్‌పై మరింత నమ్మకం కల్గింది. ‘జగన్‌కు బెయిల్ మంజూరు’అని ప్రకటన రాగానే ఒక్కసారిగా అందరూ ఆనందసాగరంలో తేలియాడారు. ఈలలు వేస్తూ, డ్యాన్స్‌లు చేస్తూ, డప్పులు వాయిస్తూ సంబరాలు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా పల్లె, పట్టణం తేడా లేకుండా టపాసులు, తారాజువ్వలతో హోరెత్తించారు. సోమవారం నెలకొన్న పండుగ వాతావరణంతో నెలన్నర ముందుగానే దీపావళి వచ్చినట్లయింది. ై‘జె జగన్, న్యాయం గెలిచింది. ధర్మం గెలిచింది. జోహార్ వైఎస్సార్’ అంటూ పార్టీ కార్యకర్తలు నినదించారు. పార్టీ నేతల ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నామధేయంతోనే...
కాంగ్రెస్ పార్టీ నుంచి వీడాక 2011 మార్చి11న జగ్గంపేటలో నూతన రాజకీయ పార్టీ పేరును జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా నామకరణం చేసిన ఆయన, తన మాతృమూర్తి వైఎస్ విజయమ్మ చేతులు మీదుగా మహానేత వైఎస్సార్ పాదాల చెంతన వైఎస్సార్‌సీపీ జెండాను మార్చి 12న ఆవిష్కరించారు. పార్టీ ప్రకటన అనంతరం పదిరోజుల్లోనే జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన మద్దతుదారుడు దేవగుడి నారాయణరెడ్డిని గెలిపించుకుని తొలిబోణి చేశారు. అనంతరం ప్రజామద్దతుతో అనేక సార్లు కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించారు. కుట్రలు, కుయుక్తుల్లో ఆరితేరిన తెలుగుదేశాన్ని సైతం చతికల పడేలా చేశారు.
ధర్మం గెలిచింది..
వైఎస్ జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక అక్రమకేసులు బనాయించి, జనంకు దూరంగా జైల్లో నిర్బంధించడంపై ధర్మం గెలిచిందని ప్రజానీకం విశ్వసిస్తోంది. అధికార మత్తుతో కాంగ్రెస్, అధికార దాహంతో తెలుగుదేశం పార్టీలు ఒక్కడిని చేసి వైఎస్ జగన్‌ను వేధింపులకు గురిచేశారు. అనేక పర్యాయాలు బెయిల్‌కు దరఖాస్తు చేస్తే ఫ్యాక్షనిస్టు కంటే క్రూరంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీ పెద్దలతో రహస్య మంతనాలకు తెరలేపుతూ వచ్చారు. ఈమారు బహిరంగంగానే జగన్ బెయిల్ అడ్డుకునేందుకు డిల్లీ పర్యటన పెట్టుకున్నారు. ఈనేపధ్యంలో కాంగ్రెస్, టీడీపీ కుట్రలను పటాపంచలు చేస్తూ జననేత వైఎస్ జగన్‌కు బెయిల్ మంజూరైంది.
వైఎస్సార్‌సీపీ నేతల్లో నూతనోత్తేజం
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌కు బెయిల్ రావడంతో వైఎస్సార్‌సీపీ జిల్లా నేతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. జగన్ జైలుకు వెళ్లిన తర్వాత జిల్లాలో జరిగిన ఉప ఎన్నికల్లో మూడు అసెంబ్లీ స్థానాలను దక్కించుకున్నారు. ఆపై డీసీసీ, డీసీసీబీ పీఠాలను కైవసం చేసుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా తిరుగులేని స్థానాలను దక్కించుకున్నారు. జగన్ లేరనే లోటు లేకుండా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూనే, ఎన్నికల్లో విజయాలు సాధించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడిన అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో సీమాంధ్ర ఉద్యమం జోరుగా సాగుతోంది. ఈ ఉద్యమానికి బాసటగా జగన్ తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెయిల్ రావడంతో పార్టీనేతల్లో నూతనోత్తేజం వెల్లివిరుస్తోంది.
అందరి దృష్టి జగన్ వైపే....
కడప పార్లమెంటుకు 2011 మే 8న ఉప ఎన్నిక లు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మినీ కేబినేట్ కడపలో తిష్టవేసి జననేత వైఎస్ జగన్‌ను ఓడించేందుకు కృషి చేసింది. డిల్లీ పెద్దలకు బుద్ధి వచ్చేలా కడప ప్రజలు ఆ ఎన్నికల్లో తీర్పునిచ్చారు. 5,45,672 ఓట్లమెజార్టీని కట్టబెట్టారు. బారతదేశంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన మూడో వ్యక్తిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రికార్డును సొంతం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ డిపాజిట్ కోల్పోయి అభాసుపాలయ్యాయి. అత్యధిక మెజార్టీ సొంతం కావడం, ప్రధాన పార్టీలు డిపాజిట్లు కోల్పోవడంతో ఒక్కమారుగా దేశ ప్రజల చూపు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై పడింది.
484 రోజులుగా జైలులోనే జననేత:
గతేడాది జూన్‌లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా మేలో రాయచోటి, రైల్వేకోడూరు, రాజంపేటలో జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జిల్లా వాసులు జగన్‌ను చూడటం అదే ఆఖరు. విచారణ కోసం రాజధానికి వెళ్లిన జగన్‌ను 2012 మే 27న సీబీఐ అరెస్టు చేసింది.
గతేడాదితో పాటు ఈ ఏడాది వైఎస్ జయంతి, వర్ధంతికి తొలిసారిగా జగన్ గైర్హాజరు అయ్యే పరిస్థితి ఏర్పడింది. 484 రోజుల నుంచి జైలులోనే గడిపారు. సీబీఐ కోర్టు బెయిల్ ఇవ్వడంతో మంగళవారం చంచల్‌గూడ జైలు నుంచి విడుదల కానున్నారు.