కలెక్టరేట్, న్యూస్‌లైన్ :
జిల్లా జారుుంట్ కలెక్టర్‌గా పౌసమిబసు రానున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆమెను వరంగల్‌కు బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళ వారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకుముందు ఇక్కడ జారుుంట్ కలెక్టర్‌గాపనిచేసిన ప్రద్యుమ్న పదోన్నతిపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యూరు. ఈ మేరకు ఆయన స్థానంలో వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ వివేక్ యూదవ్ గత నెల 30వ తేదీన ఇన్‌చార్జ్ బాధ్యతలు స్వీకరించారు. కమిషనర్, జేసీ పోస్టులు రెండూ కీలకమైనవి కావడంతో ఆయన పరిపాలనాపరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం 40 రోజుల తర్వాత పూర్తిస్థారుు నియూమకం చేపట్టింది.
కలిసొస్తున్న జిల్లా జేసీ పోస్టు...
జిల్లా జారుుంట్ కలెక్టర్ కుర్చీ అధికారులకు కలిసొస్తుందనే చెప్పాలి. సుమారు నాలుగేళ్లపాటు జేసీగా జిల్లాలో పనిచేసిన వాకాటి కరుణ పదోన్నతిపై ఉపాధి హామీ రాష్ర్ట డెరైక్టర్‌గా బదిలీపై వెళ్లారు. ఆ తర్వాత వచ్చిన జేసీ పీఎస్.ప్రద్యుమ్న నిజామాబాద్ కలెక్టర్‌గా పదోన్నతిపై వెళ్లారు. ప్రస్తుతం నెలరోజులపాటు ఇన్‌చార్జ్ జేసీగా విధులు నిర్వర్తించిన బల్దియూ కమిషనర్ వివేక్‌యూదవ్ గుంటూరు జేసీగా బదిలీపై వెళుతుండడడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు.
జాయింట్ కలెక్టర్‌గా పౌసమిబసు
Published Wed, Oct 9 2013 3:44 AM | Last Updated on Fri, Sep 1 2017 11:27 PM
Advertisement
Advertisement