అది జాయింట్ ఇండెంట్ నీరు. ఇక్కడి అవసరాలను విస్మరించి వేరొక ప్రాంతానికి మళ్లింపు అన్యాయమే. మరి ఈ ప్రాంత రైతుల పంటలు దెబ్బతింటే ఎవరు బాధ్యులు. నిర్ణయం తీసుకున్న అధికారులా...? ఇవేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్న ప్రజాప్రతినిధులా...? అసలు హెచ్చరికలే లేకుండా తమకు దక్కాల్సిన తుంగభద్ర నీటిని ఎలా ధారాదత్తం చేస్తారని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. ఆగ్రహంతో రగులుతున్నారు.
గద్వాల,న్యూస్‌లైన్: నీటిపారుదల శాఖ ఉన్నతాధికారు లు తీసుకున్న నిర్ణయంతో ఆర్డీఎస్ ప్రాజెక్టు పరిధిలో సా గైన 30 వేల ఎకరాల ఆయకట్టు పంటలకు నీళ్లందక ఎం డిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈఎన్‌సీ కార్యాలయ నిర్ణయంపై ప్రజాప్రతినిధులు ఏ నిర్ణయం తీసుకోకుండా వారం రోజులుగా కాలయాపన చేస్తుండడంతో ఆర్డీఎస్ ఆయకట్టులో పంటలు నీళ్లు లేక ఎండుతున్నాయి.తుంగభధ్ర ప్రాజెక్టులో ఉన్న ఆర్డీఎస్, కేసీ కాలువల జాయిం ట్ వాటా నీటిని హెచ్‌ఎల్‌సీకి మళ్లిస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయం రైతులకు శాపమవుతోంది.
భారీగా పెట్టుబడులు...
ప్రస్తుతం ఈ నీరు ఆధారంగా జిల్లాలోని ఐజ, వడ్డేపల్లి, మానవపాడు మండలాలకు చెందిన సుమారు 30 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలను రైతులు వేశారు. వీటి లో ఒక్క మొక్కజొన్నే 15వేల ఎకరాలకు పైబడిన విస్తీర్ణంలో సాగవుతోంది. వీటికి ఎకరాకు సుమారు రూ. 6వేల వంతున సేద్యం ఖర్చులుగా రైతులు పెట్టారు. అంటే రమారమీ 90లక్షల మేర ఖర్చుచేశారన్నమాట. ప్రస్తుతం మొక్కజొన్న కంకులు పాలుపోసే దశలో ఉం ది. ఇక మిరపకు ఎకరాకు రూ.10వేల వంతున ఖర్చు వస్తుంది. వేరుశెనగ సరేసరి. కొన్ని ప్రాంతాల్లో వీటినీ సాగుచేశారు. ఇప్పుడు నీరందక పోతే ఈ పంటలన్నీ తీ వ్రంగా దెబ్బదింటాయి. రైతులకు దిక్కుతోచని పరిస్థితే.
ఇక్కడ అవసరాలు విస్మరిస్తే ఎలా...
నీటి వాటాల బదలీ విషయంలో ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా అధికారులే నిర్ణయాలు తీసుకోవడం ఇ లా వివాదాస్పదమవుతోంది. తుంగభధ్ర బోర్డులో తమ వాటా నీటిని పూర్తిగా వాడుకోకపోయినా మరో ప్రాంత అవసరాల కోసం ఆర్డీఎస్ నీటిని మళ్లించే చర్యలకు ఉపక్రమించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయమై బుధవారం హైదరాబాద్‌లో భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డిని ఆర్డీఎస్ ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ తనగల సీతారాంరెడ్డి ఆధ్యర్యంలో ఆయకట్టు రైతులు కలిసి సమస్యను వివరించారు. ఇందుకు స్పందించిన మంత్రి సుదర్శన్‌రెడ్డి గురువారం సమస్య పరిష్కారానికి ఈఎన్‌సీతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. అసలు సమస్యకు కారణం నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ కార్యాలయంలో జరిగిన నిర్ణయం. తుంగభద్ర ప్రాజెక్టు నుంచి రబీ సీజన్ వాటాగా ఆర్డీఎస్ నీటిమళ్ళింపు పథకానికి 4.5 టీఎంసీలు, కర్నూలు కడప కాలువ(కేసి కాలువ)కు 7.5 టీఎంసీల వాడుకునే అవకాశం ఉంది. మొదటి పంట పూర్తి కావడంలో ఆలస్యం కావడం, ఐఏబిల సమావేశాలలో రెండవ పంట ఆయకట్టుపై నిర్ణయం జాప్యం కారణంగా కర్నూల్ ఎస్‌సీ తుంగభద్ర బోర్డుకు ఇండెంట్ పెట్టడంలో ఆలస్యమైంది.
ఈ అవకాశాన్ని అదనుగా తీసుకున్న ఈఎస్‌సీ కార్యాలం అధికారులు తుంగభద్ర బోర్డులో ఉన్న ఆర్డీఎస్, కేసీ కాలువల జాయింట్ ఇండెంట్ నీటని హెచ్‌ఎల్‌సీకి మళ్లించేలా ఉత్తర్వులు జారీ చేశారు. అదే జరిగితే కేసీ కాలువ పరిధిలో రెండో పంటకు నీళ్లు అందక పోగా, మన జిల్లా పరిధిలోని ఆర్డీఎస్ పరిధిలో ఉన్న 30 ఎకరాల పంట పూర్తి కాకుండానే ఎండిపోయే ప్రమాదం ఉంది. ఆర్డీఎస్ ప్రధాన కాలువకు మూడు రోజుల క్రితమే నీటి విడుదల నిలిచిపోయింది. తక్షణమే విడుదల చేయకపోతే రైతులు తీవ్రంగా నష్టపోవాల్సివస్తుంది.
పంటలను కాపాడాలి-
ఆర్డీఎస్ మాజీ చైర్మన్ సీతారాంరెడ్డి.
ఆర్డీఎస్ పరిధిలో పూర్తి కావాల్సిన పంట 30 వేల ఎకరాలలో ఉంది. పంటను కాపాడాలి. దీంతో పాటు ఆర్డీఎస్ వాటాను హెచ్‌ఎల్‌సీ కాలువకు ఎలా బదిలీ చేస్తారు. ప్రాజెక్టుల వాటాను మరో ప్రాజెక్టుకు మార్చడం అన్యా యం ఈ చర్యపై పోరాడుతాం. జిల్లాలోని ప్రజాప్రతినిధులు స్పందించాలి.
గెట్ల నీరిస్తరు...!
Published Thu, Dec 26 2013 3:58 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 AM
Advertisement
Advertisement