‘కడప ఉక్కు’ మన హక్కు | Kadapa Steel Plant For Student Unions Protest YSR Kadapa | Sakshi
Sakshi News home page

‘కడప ఉక్కు’ మన హక్కు

Published Fri, Jul 20 2018 8:44 AM | Last Updated on Fri, Jul 20 2018 8:44 AM

Kadapa Steel Plant For Student Unions Protest YSR Kadapa - Sakshi

జీపు యాత్ర ముగింపు సభలో పాల్గొన్న విద్యార్ధి సంఘాల ఐక్య వేదిక నాయకులు

కడప రూరల్‌: కడపలో ఉక్కు కర్మాగారం మా హక్కు... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలను కట్టిపెట్టి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని విద్యార్ధి సంఘాల ఐక్య వేదిక నాయకులు అన్నారు లేకుంటే పతనం తప్పదని హెచ్చరించారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం త్వరలో చేపట్టే  ‘చలో ఢిల్లీ’ సన్నాహక కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా చేపట్టిన జీపు యాత్ర గురువారం కడపకు చేరింది. ఈ సందర్భంగా స్ధానిక ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన ముగింపు సభలో ఆర్‌ఎస్‌వైఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు, ఏపీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు జయవర్ధన్, టీఆర్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎన్‌ రాజా మాట్లాడుతూ ‘కడప ఉక్కు’ సాధన కోసం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో ఆడుతున్న నాట కాలకు తెరదించాలన్నారు. దీంతోపాటు విభజన హమీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. పుల్లయ్య, శివప్రసాద్, చంద్ర, అశోక్, రమణ, కన్నయ్య తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement