అలాయ్.. బలాయ్.. | kadiyam srihari daughter marriage | Sakshi
Sakshi News home page

అలాయ్.. బలాయ్..

Published Sat, Dec 14 2013 4:55 AM | Last Updated on Sat, Sep 2 2017 1:34 AM

kadiyam srihari daughter marriage

 వరంగల్ సిటీ, న్యూస్‌లైన్
 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలసాకరమయ్యే ప్రస్తుత తరుణంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం హన్మకొండకు రావడంతో తెలంగాణవాదులు అభినందనలతో ముంచెత్తారు. హన్మకొండ పీజీఆర్‌గార్డెన్‌లో జరిగిన మాజీ మంత్రి కడియం శ్రీహరి కుమార్తె రమ్య, శేషశయనదాస్‌ల వివాహానికి కేసీఆర్ హాజరయ్యారు. హన్మకొండకు ఉదయం 11.20 సమయంలో చేరుకున్న ఆయన మధ్యాహ్నం 1.20లకు తిరిగి హైదరాబాద్ వెళ్లి పోయారు. కేసీఆర్ ఉన్నంతసేపు అక్కడి వాతావరణం అలాయ్..భలాయ్‌ను తలపించింది. కడియం శ్రీహరి కుమార్తె వివాహ వేడుకలో కేసీఆర్, మంత్రి బస్వరాజు సారయ్యలు పక్కపక్కన కూర్చొని మాట్లాడుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.
 
  అనంతరం కేసీఆర్ మాజీ డీజీపీ పేర్వారం రాములు నివాసానికి చేరుకున్నారు. అక్కడ కేసీఆర్‌ను టీఎన్జీవోలు, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ పరిటాల సుబ్బారావు నేతృత్వంలో తలపాగా పెట్టి సన్మానించారు. పరిటాల సుబ్బారావు మాట్లాడుతూ ఎంతో దూరదృష్టితో తెలంగాణ ప్రజలను ఐక్యం చేసి రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ ప్రధాన భూమిక పోషించారని అన్నారు. అనేక దూషణలు, శ్రమకోర్చి అరవైయేండ్ల కలను నిజం చేయడంలో గొప్ప పరిణతిని ప్రదర్శించారని వివరించారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఉద్యోగులు తమపాత్రను నిర్వర్తిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన ఉద్యోగసంఘాల నాయకులను కేసీఆర్ ఆలింగనం చేసుకున్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రత్యేక స్కీం రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు కోలా రాజేష్‌గౌడ్, హుస్సేన్, వెంకటేశ్వర్లు, జగన్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
 
 ఆ తర్వాత తెలంగాణ న్యాయవాద జేఏసీ నేత గుడిమల్ల రవికుమార్ ఆధ్వర్యంలో న్యాయవాదుల బృందం కేసీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదులను గెజిటెడ్ హోదా కల్పించాలని, హెల్త్‌కార్డులు జారీ చేయాలని కోరారు. ఉద్యమంలో న్యాయవాదుల పాత్రను ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేశారు. పునర్నిర్మాణంలో కలిసికట్టుగా సాగాలన్నారు. ఈ బృందంలో గునిగంటి శ్రీనివాస్, తాళ్ళపెల్లి జనార్దన్‌గౌడ్, మొలుగూరి రంజిత్, నీలా శ్రీధర్‌రావు, సూరం నర్సింహస్వామి, వెంకటేశ్వర్‌రావు, సూదుల వేణుగోపాల్, అంజయ్యగౌడ్, శ్రీనివాస్, రాజేందర్, సాంబశివరావు, కోటేశ్వర్ తదితరులు ఉన్నారు. కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్లు కేసీఆర్‌ను ప్రత్యేకంగా కలిశారు. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి నేతృత్వంలో ఈ బృందం కలిసింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో విద్యావేత్తల పాత్రపై కొద్ది సేపు మాట్లాడారు. ఈ బృందంలో ప్రొఫెసర్ దినేష్‌కుమార్, సీతారామరావు తదితరులు ఉన్నారు.
 
 వ్యవసాయ మార్కెట్ దడువాయిల ప్రతినిధి బృందం కేసీఆర్‌ను కలిసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తమను మార్కెట్ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ను కాంటాతో తూకం వేశారు.  ఈ కార్యక్రమంలో మార్త శ్యామ్, నూరవీరస్వామి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్, టీఆర్‌ఎస్వీ, యూత్ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ కలసాకారమవుతుందనే ఆనందం వ్యక్తం చేశారు. కేసీఆర్ వెంట టీఆర్‌ఎస్ నేతలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, పేర్వారం రాములు, పెద్ది సుదర్శన్‌రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావు, తక్కెళ్ళపెల్లి రవీందర్‌రావు, ఆరూరి రమేష్, చందూలాల్, ఇండ్ల నాగేశ్వర్‌రావు తదితరులు ఉన్నారు.
 
  ఉద్యోగులకు ప్రత్యేక ప్రయోజనాలు
 జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రత్యేకంగా ప్రయోజనాలు కల్పిస్తామని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చారు. నగరంలో జరిగిన వివాహానికి హాజరైన కే సీఆర్‌ను పంచాయతీరాజ్ ఉద్యోగ సంఘాల నాయకులు కలిసి పుష్పగుచ్చాన్ని అందించారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర గణనీయమైందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమంలో ఇబ్బందులు పడిన ఉద్యోగులను గుర్తించి వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు. కేసీఆర్‌ను కలసిన వారిలో పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సాదుల ప్రసాద్, డిప్లొమో ఇంజనీర్స్ అసోసియేషన్ సంఘం నాయకులు గట్ల మహీపాల్‌రెడ్డి, పులి ప్రభాకర్, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement