హామీలను తుంగలో తొక్కిన బాబు | Kakani Govardhan Reddy comments on the chandrababu | Sakshi
Sakshi News home page

హామీలను తుంగలో తొక్కిన బాబు

Published Sun, Sep 21 2014 4:10 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

Kakani Govardhan Reddy comments on the chandrababu

 -సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి
మొగళ్లూరు(పొదలకూరు) : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఐదు సంతకాలు చేసిన హామీలకు సంబంధించి ఒక్క వాగ్దానాన్ని అమలు చేయకుండా తుంగలో తొక్కారని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని మొగళ్లూరు, వావింటపర్తి, ఊసపల్లి గ్రామాల్లో శనివారం ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజావిజ్ఞప్తులను స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రుణమాఫీ, సృజలస్రవంతి, బెల్టుషాపుల నిర్మూలన, పింఛన్ల పెంపు తదితర ప్రధాన హామీలను సైతం ముఖ్యమంత్రి అమలు చేయలేకపోతున్నారన్నారు.

పింఛన్ల కోసం వృద్ధులు పడని పాట్లు లేవన్నారు. ఎంతమంది పింఛన్లు ఉంటాయో, ఊడుతాయో చెప్పలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారన్నారు.  67 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఉన్నారనే కారణంతో సీఎం ఎమ్మెల్యేలకు కేటాయించే ఏడాదికి రూ.50 లక్షల నిధులను కూడా నిలిపివేశా రన్నారు. గ్రామాల పర్యటనలో ఎమ్మెల్యేకు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.  

ఎంపీపీ కోనం బ్రహ్మయ్య, మొగళ్లూరు, పులికల్లు ఎంపీటీసీ సభ్యులు కూకట్ల పెంచలలక్ష్మీ, నల్లు పద్మమ్మ, సర్పంచ్‌లు మోడిబోయిన పాపమ్మ, సోమా సుబ్రమణ్యం, పార్టీ మండల అధ్యక్షుడు పెదమల్లు రమణారెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యుడు గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, నాయకులు యాతం పెంచలరెడ్డి, వై.పెంచలరెడ్డి, చెన్నూరు సుబ్బరాయుడు, పలుకూరు పెంచలనారాయణరెడ్డి, యనమల రమణారెడ్డి, చిల్లకూరు బాలకృష్ణారెడ్డి, నెట్టెం కృష్ణంనాయుడు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement