ప్రయాణికుల ఆందోళన
కశింకోట/సీతంపేట : విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళుతున్న కాళేశ్వరి ట్రావెల్స్ బస్సులో గురువారం రాత్రి పొగలు రావడంతో ప్రయాణికులు భయభ్రాంతులయ్యారు. కాళేశ్వరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు గురువారం రాత్రి 9 గంటల సమయంలో 49 మంది ప్రయాణికులతో విశాఖపట్నం నుంచి హైదరాబాద్ బయలుదేరింది. కశింకోట మండలంలోని తాళ్లపాలెం ప్రాంతంలో ప్రయాణికులు టాయిలెట్ కోసం బస్సు ఆపమన్నారు. కిందకు దిగినవారు బస్సు వెనుక నుంచి దట్టమైన పొగ లు రావడాన్ని గమనించి డ్రైవర్‌కు తెలిపారు. ఇంకొంత దూరం ప్రయాణించి ఉంటే బస్సు దగ్ధమయ్యేదని డ్రైవర్ చెప్పటం వారిని మరింత ఆందోళనకు గురిచేసింది. ఈ విషయాన్ని రాత్రి 11 గంటల సమయంలో సంస్థ కార్యాలయానికి తెలిపి ఇంకో బస్సు ఏర్పాటుచేయాలని కోరారు. ఎంతకీ బస్సు రాకపోగా ప్రయాణికులు ఫోనుచేసినా ఎవరూ స్పందించలేదు. దీంతో వారు తాళ్లపాలెం ప్రాంతంలో కాలి బాటలపైన , దుకాణాలు, ఇళ్ల చూరుల కింద రాత్రంతా జాగరణ చేశారు. ఉదయం హైదరాబాద్ నుంచి విశాఖ వెళుతున్న అదే ఏజెన్సీకి చెందిన మూడు బస్సులను అడ్డుకుని రాస్తారోకో నిర్వహించారు.
కాళేశ్వరి కార్యాలయం వద్ద ధర్నా
ఉదయం విశాఖ చేరుకున్న ప్రయాణికులు సీతంపేట కూడలి లోని కాళేశ్వరి ట్రావెల్స్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ఒక్కొక్కరి నుంచి రూ.1,200 వసూలు చేసి కండిషన్‌లో లేని బస్సును ఏర్పాటుచేస్తారా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనం తరం బాధితులు 4వ పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు.
కాళేశ్వరి ట్రావెల్స్ బస్సులో పొగలు
Published Sat, May 10 2014 3:31 AM | Last Updated on Sat, Sep 2 2017 7:08 AM
Advertisement