visaka patnam
-
కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారు: లక్ష్మీ పార్వతి
విశాఖపట్నం: చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోతున్నారని వైఎస్సార్సీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి అన్నారు. చంద్రబాబు అండ్ కొ సంఘ విద్రోహులని మండిపడ్డారామె.బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఎన్టీఆర్ వెన్నుపోటులో పురందేశ్వరి ప్రధాన పాత్ర పోషించింది. నేతి బీరకాయలో నెయ్యి లాంటిది పురందేశ్వరి మంచితనం. పురందేశ్వరి కూడా చంద్రబాబు లాంటి మనిషే. ఎఫ్ఐఆర్లో వైఎస్సార్ పేరును చేర్చిన కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరడం ఏమిటి..?. వీరందరినీ చంద్రబాబు ఆడిస్తున్నారు. రాజకీయ నీచుడు చంద్రబాబు. చంద్రబాబు కంటే సీఎం జగన్ అధిక పెట్టుబడులు తీసుకొచ్చారు. ఏపీ అభివృద్ధిలో విశాఖ కీలకం. ఏం మాట్లాడాలో అర్ధంకాక బాబు ఇచ్చిన స్క్రిప్ట్ మోదీ చదివారు. సీఎం జగన్‌ను గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలి అంటే సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి రావాలి. నేను రాష్ట్రం మొత్తం తిరిగాను. గీతం మూర్తి ఎన్టీఆర్ వెన్నుపోటులో కీలక పాత్ర పోషించిన దుర్మార్గుడు. గీతం భరత్‌ను ఓడించాలి. గీతం అంటేనే భూ కబ్జాలు. ఏయూను నాశనం చెయ్యాలనే ఉద్దేశంతోనే గీతంను అభివృద్ధి చేశారు’ అని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. -
ప్రతి ప్రయాణికుడికి థర్మల్ స్కానింగ్..
సాక్షి, విశాఖపట్నం: రైల్వే స్టేషన్‌కు వచ్చి, బయటకు వెళ్లే ప్రతి ప్రయాణికుడిని థర్మల్ స్కానర్ ద్వారా తనిఖీ చేస్తున్నామని విశాఖ రైల్వే ష్టేషన్ చీఫ్ మేనేజర్ సురేష్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్-19( కరోనా వైరస్) నిరోధానికి విశాఖ రైల్వే స్టేషన్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రైల్వేస్టేషన్ ప్రధాన గేటు1, వెనుక వైపు జ్ఞానాపురం గేటు ను మాత్రమే తెరిచి ఉంచామని తెలిపారు. (రేపు జనతా కర్ఫ్యూ పాటిద్దాం: గౌతం సవాంగ్) ప్రయాణికుల తనిఖీకి నాలుగు ధర్మల్ స్కానర్లను అందుబాటులో ఉంచామని ఆయన పేర్కొన్నారు. ప్రయాణికులను పరీక్షించడానికి నలుగురు చొప్పున పది బృందాలను మూడు షిఫ్ట్‌ల్లో ఉంచామని చెప్పారు. ప్రతీ బృందంలో ఆర్పీఎఫ్ పోలీసులు, సివిల్, డిఫెన్స్, టిక్కెట్ కలెక్టర్లను ఏర్పటు చేశామన్నారు. (రైళ్లలో కరోనా రోగులుంటారు జాగ్రత్త : ప్రయాణం ప్రమాదం) రేపటి ‘జనతా కర్ఫ్యూ’ నేపథ్యంలో విశాఖ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమయ్యే జన్మభూమి, రత్నాచల్, గోదావరి, విశాఖ, ఎల్టీటీ రైళ్లను రద్దు చేశామన్నారు. విశాఖ రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగే 50 వరకు రైళ్లు రద్దు అయ్యాయని తెలిపారు. రేపు ప్రజలంతా స్వచ్ఛందంగా ‘కర్ఫ్యూ ’ పాటించి కరోనాని నియంత్రించాలని సురేష్ పిలుపునిచ్చారు. (కరోనా: రైళ్లు రద్దు.. డబ్బు వాపస్!) -
‘రాజధాని అభివృద్ధి అంటే భవనాలు కట్టడం కాదు’
సాక్షి, విశాఖపట్నం: అభివృద్ధి వికేంద్రీకరణను స్వాగతిస్తున్నామని మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ అన్నారు. అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణపై ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాజధాని విషయంలో గత ప్రభుత్వం నిరంకుశంగా, ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆయన మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలోని ప్రజలు, రాజకీయపార్టీలను సంప్రదించలేదని ఆయన గుర్తుచేశారు. వికేంద్రీకరణ నాలుగు విధాలుగా జరగాలని శర్మ అభిప్రాయపడ్డారు. రాజకీయ, పరిపాలన, ఆర్థిక పరంగా వికేంద్రీకణ ఉండాలని తెలిపారు. సుప్రీంకోర్టు సలహాతో కోర్టులు కూడా మూడు లేదా నాలుగు బెంచ్‌లుగా ఏర్పాటు చేయాలన్నారు. న్యాయస్థానాలు గ్రామస్థాయి వరకు పెంచాలని ఈఏఎస్ శర్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వీసీ ప్రొఫెసర్ చలం మాట్లాడుతూ.. విశాఖపట్నం రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణపై గతంలో శివరామకృష్ణ కమిటీ ఎనిమిది పేజీల నివేదిక ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. పాలన అన్నది ప్రజల వద్దకు వెళ్లాలంటే వికేంద్రీకరణ జరగాలన్నారు. విశాఖకు రాజధాని వస్తే ప్రజలకు ఆదాయం, సౌకర్యాలు పెరిగేలా ఉండాలన్నారు. ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్లిన 15 లక్షల మంది తిరిగి వచ్చేలా.. వ్యవసాయం, పరిశ్రమలను అభివృద్ధి చేయాలని మాజీ వీసీ ప్రొఫెసర్ చలం పేర్కొన్నారు. లా యూనివర్సిటీ మాజీ వీసీ, న్యాయ శాస్త్ర నిపుణులు ప్రొఫెసర్ వై. సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎగ్జిక్యూటివ్ కాపిటల్‌గా విశాఖపట్నంను ప్రభుత్వం ఎంచుకోవటం మంచి నిర్ణయమని కొనియాడారు. రాజధాని అభివృద్ధి అంటే ఒక చోట భూములు తీసుకుని భవనాలు కట్టడం కాదన్నారు. అభివృద్ధికి కావల్సిన అన్ని వనరులు విశాఖలో ఉన్నాయని ఆయన తెలిపారు. సీట్ ఆఫ్ గవర్నెన్స్ విశాఖలోనే ఉంటుందన్న ప్రభుత్వ నిర్ణయం అభినందనీయమన్నారు. రాజకీయ, విద్య, ఆర్ధిక రంగాల్లో అభివృద్ధి చెందిన నగరం విశాఖ అని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వపాలన చక్కగా నడవడానికి ప్రజలు మంచి దృక్పధంతో ఉన్నారని సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో చేసిన ప్రతిపాదనల్లో మంచి ప్రతిపాదన రాష్టాభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకోవటం అన్నారు. దానివల్ల రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. సీట్ ఆఫ్ గవర్నెన్స్ వల్ల అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని ప్రొఫెసర్ సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన రెండు ప్రకటనలను తాము స్వాగతిస్తున్నామని ఉత్తరాంధ్ర ప్రజాగాయకుడు, కవి రాజశేఖర్ తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ అనే మాట ఉత్తరాంధ్రవాసుల్లో ఆశలు చిగురింపజేసిందని చెప్పారు. కోటి జనాభా, 19 నదులున్న ఉత్తరాంధ్ర నేలలో అభివృద్ధి జరగాలని ఆయన పేర్కొన్నారు. వికేంద్రీకరణను అడ్డుకుంటున్న శక్తులు ఎవరైనా.. సోంపేట, కాకరపల్లి థర్మల్ అణువిద్యుత్ కార్మాగారాలను అడ్డుకోండని రాజశేఖర్ అన్నారు. విశాఖలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ, మాజీ వీసీ ప్రొఫెసర్ చలం, న్యాయ శాస్త్ర నిపుణులు ప్రొఫెసర్ వై. సత్యనారాయణ, ప్రజాగాయకుడు, కవి రాజశేఖర్ పాల్గొన్నారు. -
నో హెల్మెట్..నో పెట్రోల్..
సాక్షి, విశాఖపట్నం : రోడ్డు ప్రమాదాల్లో మరణాల రేటును తగ్గించేందుకు త్వరలో నో హెల్మెట్– నో పెట్రోల్ విధానాన్ని అమలు చేయాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. హెల్మెట్ లేని వాహన చోదకులకు పెట్రోల్ పోయకుండా పెట్రోల్ బంకుల యజమానులను ఆదేశించాలన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన రహదారి భద్రత కమిటీ సమావేశంలో పోలీస్ కమిషనర్ యోగానంద్, ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, వుడా వీసీ బసంత్‌కుమార్‌తో కలిసి పరిస్థితిని సమీక్షించారు. గతేడాది జరిగిన ప్రమాదాల గురించి డీటీసీ ఎస్.వెంకటేశ్వరరావు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. 2016లో జరిగిన 2,609 రోడ్డు ప్రమాదాల్లో 551 మంది మరణించారని, 2,058 మంది గాయాలపాలయ్యారని తెలిపారు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ ద్విచక్రవాహనచోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా చూస్తే చాలావరకు మరణాల రేటును తగ్గించవచ్చన్నారు. హెల్మెట్ వాడకంపై ద్విచక్రవాహనచోదకుల్లో అవగాహన పెరిగేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పోలీస్, రవాణా శాఖలు ప్రత్యేక చొరవతో ద్విచక్రవాహనచోదకులకు హెల్మెట్ తప్పనిసరి చేయాలన్నారు. సమన్వయంతో సత్ఫలితాలు అనకాపల్లి–ఆనందపురం జాతీయ రహదారి పనులు నిర్వహించే ముందు సమన్వయ కమిటీతో చర్చించి వారి సూచనలకు అనుగుణంగా పనులు నిర్వహిస్తే మంచి ఫలితాలుంటాయని సీపీ యోగానంద్ అన్నారు. నక్కపల్లి–యలమంచిలి రోడ్డుపై లైటింగ్, సైన్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ సూచించారు. సమావేశంలో అదనపు డీసీపీ మహేంద్ర పాత్రుడు, ఏసీపీ కె.ప్రభాకరరావు, ఆర్టీవోలు ఎ.హెచ్. ఖాన్, ఐ.శివప్రసాద్, కేజీహెచ్ అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రమాద నివారణ మార్గాలివీ.. ► ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలను కలెక్టర్ అధికారులకు సూచించారు. ► ‘నో హెల్మెట్.. నో పెట్రోల్’ విధానం అమలుకు కార్యాచరణ రూపొందించాలి. ► జాతీయ రహదారికి అనుసంధానమయ్యే కూడళ్లలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నందున ఆ జంక్షన్లలో సైన్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి. ► కప్పరాడ, మధురవాడ, ఆనందపురం తదితర ప్రాంతాల్లో డివైడర్లు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నందున వాటిని ఏర్పాటు చేయాలి. ► రద్దీగా ఉండే గాజువాక, ఎన్ఏడీ, మద్దిలపాలెం, సత్యం తదితర జంక్షన్లలోనూ సెంట్రల్ మీడియన్ గ్రిల్స్ పాడైపోవడం, కొన్ని చోట్ల లేనందువల్ల ప్రమాదాలు జరుగుతున్నందున వాటిని నిర్మించాలి. ► జాతీయ రహదారి శివారు ప్రాంతాల్లో వీధి దీపాలు లేకపోవడం ప్రమాదాలకు దారి తీస్తున్నందున చర్యలు చేపట్టాలి. ► ప్రధాన రహదారుల్లో ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపకుండా పార్కింగ్ స్థలాలను నిర్దేశించి, అన్నిచోట్ల సైన బోర్డులు ఏర్పాటు చేయాలి. ► ప్రమాదాలకు గురైన వారిని వెంటనే ఆస్పత్రులకు తరలించేందుకు వీలుగా ప్రధాన కూడళ్లలో అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలి. అంబులెన్స్ వివరాలు తెలియజేస్తూ వాహన యజమానులు, డ్రైవర్లకు ఎస్ఎంఎస్ చేయాలి. -
విశాఖకు రైల్వే జోన్‌పై పరిశీలన: రైల్వే మంత్రి
విశాఖపట్నం: విశాఖపట్నానికి రైల్వే జోన్ మంజూరు చేసే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. రానున్న రోజుల్లో ప్రజలను సంతోష పెట్టేలా నిర్ణయం తీసుకుంటామని అన్నారు. తుపాన్ విపత్తు నుంచి విశాఖ ప్రజలు మనోధైర్యంతో కోలుకున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. విశాఖ వాసులకు అభినందనలు తెలిపారు. ప్రజలను మనోభావాలను గుర్తించామని త్వరలోనే వాటిని నెరవేరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సురేష్ ప్రభు అత్త హఠాన్మరణం చెందడంతో ఆయన విశాఖకు ప్రత్యేక రైలులో వచ్చారు. -
కాళేశ్వరి ట్రావెల్స్ బస్సులో పొగలు
ప్రయాణికుల ఆందోళన కశింకోట/సీతంపేట : విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళుతున్న కాళేశ్వరి ట్రావెల్స్ బస్సులో గురువారం రాత్రి పొగలు రావడంతో ప్రయాణికులు భయభ్రాంతులయ్యారు. కాళేశ్వరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు గురువారం రాత్రి 9 గంటల సమయంలో 49 మంది ప్రయాణికులతో విశాఖపట్నం నుంచి హైదరాబాద్ బయలుదేరింది. కశింకోట మండలంలోని తాళ్లపాలెం ప్రాంతంలో ప్రయాణికులు టాయిలెట్ కోసం బస్సు ఆపమన్నారు. కిందకు దిగినవారు బస్సు వెనుక నుంచి దట్టమైన పొగ లు రావడాన్ని గమనించి డ్రైవర్‌కు తెలిపారు. ఇంకొంత దూరం ప్రయాణించి ఉంటే బస్సు దగ్ధమయ్యేదని డ్రైవర్ చెప్పటం వారిని మరింత ఆందోళనకు గురిచేసింది. ఈ విషయాన్ని రాత్రి 11 గంటల సమయంలో సంస్థ కార్యాలయానికి తెలిపి ఇంకో బస్సు ఏర్పాటుచేయాలని కోరారు. ఎంతకీ బస్సు రాకపోగా ప్రయాణికులు ఫోనుచేసినా ఎవరూ స్పందించలేదు. దీంతో వారు తాళ్లపాలెం ప్రాంతంలో కాలి బాటలపైన , దుకాణాలు, ఇళ్ల చూరుల కింద రాత్రంతా జాగరణ చేశారు. ఉదయం హైదరాబాద్ నుంచి విశాఖ వెళుతున్న అదే ఏజెన్సీకి చెందిన మూడు బస్సులను అడ్డుకుని రాస్తారోకో నిర్వహించారు. కాళేశ్వరి కార్యాలయం వద్ద ధర్నా ఉదయం విశాఖ చేరుకున్న ప్రయాణికులు సీతంపేట కూడలి లోని కాళేశ్వరి ట్రావెల్స్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ఒక్కొక్కరి నుంచి రూ.1,200 వసూలు చేసి కండిషన్లో లేని బస్సును ఏర్పాటుచేస్తారా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనం తరం బాధితులు 4వ పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. -
‘రాజధాని’పై క్షేత్ర స్థాయి అధ్యయనం
సీమాంధ్రలో నేటి నుంచి కేంద్ర కమిటీ పర్యటన హైదరాబాద్/విశాఖపట్నం: సీమాంధ్ర రాజధాని ఎంపిక కోసం కేంద్రం నియమించిన ప్రత్యేక కమిటీ క్షేత్రస్థాయి అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మాజీ కార్యదర్శి శివరామకృష్ణన్ నేతృత్వంలోని కమిటీ శుక్రవారం విశాఖపట్నం చేరుకుంది. కమిటీ సభ్యులు రతిన్‌రాయ్, ఆరోమర్రేవి, జగన్‌షా, ప్రొఫెసర్ రవీంద్రన్‌లతో కూడిన ఈ బృందం విమానాశ్రయం నుంచి నేరుగా ప్రభుత్వ అతిథి గృహానికి వెళ్లిన వెంటనే కసరత్తు ప్రారంభించింది. జీవీఎంసీ కమిషనర్ ఎం.వి.సత్యనారాయణ సుమారు గంట పాటు స్థానిక పరిస్థితులను వారికి వివరించారు. జిల్లాలో పెట్రోలియం, కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్(పీసీపీఐఆర్), సెజ్‌ల స్థితిగతులను కమిటీ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ స్థలాలు, నీటి వనరులు, గిరిజన ప్రాంతాలు, రోడ్లు, ట్రాఫిక్ పరిస్థితులు, కొత్త లేఅవుట్ల వివరాలను ఆరా తీశారు. నగర భౌగోళిక పరిస్థితులతో పాటు జీవీఎంసీ ఆర్థిక స్థితి, ఇంటి పన్నులు, జేఎన్ఎన్యూఆర్ఎం ప్రాజెక్టు, 13వ ఆర్థిక సంఘం నిధులు వంటి అంశాలను కమిటీ సభ్యులకు కమిషనర్ వివరించారు. కాగా, స్థానిక ప్రజా సంఘాల ప్రతినిధులు కూడా కమిటీని కలసి విశాఖను రాజధాని చేయాలంటూ వినతి పత్రాలు అందజేశారు. మరోవైపు రాజధానిగా విశాఖకు ఉన్న అర్హతలను కమిటీ దృష్టికి తెచ్చేందుకు శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించాలంటూ పలు పార్టీల నేతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్‌ను కోరారు. కమిటీ సభ్యులతో చర్చించిన తర్వాత కలెక్టర్ దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. శనివారం మాత్రం ఈ కమిటీ సభ్యులు ఉదయం 6.30 నుంచే విశాఖలో పర్యటించనున్నారు. ఇతర నగరాల్లోనూ పర్యటనలు: విశాఖలో పరిశీలన అనంతరం కమిటీ సభ్యులు.. ఆదివారం రాజమండ్రి, విజయవాడ ప్రాంతాలను పరిశీలిస్తారు. మరుసటి రోజు(12న) ఉదయం 10 గంటలకు కృష్ణా జిల్లా కలెక్టర్, విజయవాడ మున్సిపల్ కమిషనర్, వీజీటీఎం అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం గుంటూరు, మంగళగిరి ప్రాంతాలను పరిశీలిస్తారు. 13న శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో ఈ అధ్యయన కమిటీ హైదరాబాద్ చేరుకుంటుంది. 14న ప్రభుత్వ ఉన్నతాధికారులు, గవర్నర్‌తో సమావేశం తర్వాత ఢిల్లీ బయల్దేరి వెళుతుంది. 12న హైదరాబాద్‌కు గోస్వామి: రాష్ట్ర విభజన ప్రక్రియను సమీక్షించేందుకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి ఈనెల 12న హైదరాబాద్ వస్తున్నారు. అధికారులతో సమావేశం తర్వాత ఆయన అసెంబ్లీ, జూబ్లీహాల్లతోపాటు సీమాంధ్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసం కోసం ఎంపిక చేసిన లేక్‌వ్యూ అతిథి గృహాన్ని సందర్శిస్తారు. -
ఒకే గుండెతో.. అవిభక్త కవలల జననం
విశాఖపట్నం ప్రభుత్వ ఘోషా ఆస్పత్రిలో శుక్రవారం ఉదయం అరుదైన అవిభక్త కవలలు జన్మించారు. మగ శిశువులిద్దరూ ఛాతీ వద్ద అతుక్కుని పుట్టారు. ఇద్దరికీ ఒకే గుండె, ఒకే కాలేయం ఉన్నాయి. చికిత్స నిమిత్తం వీరిని కేజీహెచ్‌కు పంపించారు. శిశువుల తండ్రి మారపల్లి యర్రయ్య భవన నిర్మాణ సెంటరింగ్ కార్మికుడు. తల్లి నూకాలమ్మ గృహిణి. ఆమెకిది మూడో కాన్పు. తొలి రెండు కాన్పులు కూడా ఆమెకు నిరాశనే మిగిల్చాయి. అండ విభజన సరిగా జరిగితే కవలలు జన్మిస్తారని.. సరిగ్గా జరగకపోతే ఇలా అవిభక్త కవలలు పుడతారని ఘోషా ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ ఉమ చెప్పారు. కొందరు తల వద్ద, మరొకొందరు చాతీవద్ద, ఇంకొందరు నడుము వద్ద అతుక్కుని పుడతారన్నారు. శిశువులిద్దరినీ కేజీహెచ్‌కు పంపించి చికిత్స చేయిస్తామన్నారు. -
వందకు కుళాయి ఒట్టి మాటేనా?
‘రూ.100కే కుళాయి కనెక్షనిస్తాం. బీపీఎల్ కుటుంబాలన్నీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఏడాది కాలంలో నగర పరిధిలో సుమారు 12 వేల కుటుంబాలకు నీటి వసతి అందిస్తాం’ అంటూ ప్రకటనలు గుప్పించిన జీవీఎంసీ యంత్రాంగం అమల్లో చతికిలపడింది. జీవీఎంసీలో విలీనమైన అనకాపల్లి, భీమునిపట్నంలోని అధికారులు మంజూరు చేసిన స్థాయిలో కూడా కుళాయి కనెక్షన్లు ఇవ్వలేదు. నిధులు రాలేదట! 13వ ఆర్థిక సంఘ నిధుల్లో భాగంగా దారిద్య్ర రేఖకు దిగువనున్న(బీపీఎల్) కుటుంబాలకు ఉచితంగా కుళాయి కనెక్షన్లు మంజూరు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.1200 డిపాజిట్‌తో బీపీఎల్ కుళాయి కనెక్షన్లు ఇస్తున్నారు. ఉన్నఫళంగా డిపాజిట్ లేకుండా, అన్ని పరికరాలు ఉచితంగా అందించడం ఆర్థిక భారమవుతుందని ప్రభుత్వానికి జీవీఎంసీ గతంలో నివేదించింది. దీంతో ఆ మొత్తం 13వ ఆర్థిక సంఘ నిధులతో సర్దుబాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు నగర పరిధిలో సుమారు 12 వేల కుళాయి కనెక్షన్లు రూ.100కే అందించనున్నట్టు జీవీఎంసీ ప్రకటించింది. ఇందుకు రూ.2.36 కోట్లు ఆర్థిక సంఘ నిధులకు ప్రతిపాదనలు పంపింది. కానీ ఇప్పటి వరకు ఈ విభాగంలో సుమారు 200 కనెక్షన్లకు మించి మంజూరు చేయలేదని అధికారులు చెప్తున్నారు. ఆ 200 కనెక్షన్లు కూడా గతంలో ఉన్న బీపీఎల్ నిబంధనలనే కాస్త సవరించి, కనెక్షన్ మంజూరు సమయంలో రూ.100 చెల్లించి, తర్వాత నెలకు రూ.100 చొప్పున 11 నెలలు చెల్లించాలని ఆదేశించారు. ఆర్థిక సంఘ నిధులు విడుదలైతే.. మిగిలిన 11 నెలల మొత్తాన్ని.. తర్వాతి నీటి చార్జీల బిల్లులో సర్దుబాటు చేస్తామని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఆ విభాగంలో ఒక్క రూపాయీ జీవీఎంసీకి రాలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
పచ్చని చిచ్చు
విశాఖపట్నం : గంటా శ్రీనివాసరావుది ఐరెన్‌లెగ్ అని టీడీపీ నేత అయ్యన్న చేసిన వ్యాఖ్యలు నిజమవుతున్నాయంటూ పార్టీలో చర్చిం చుకుంటున్నారు. గంటా బృందం టీడీపీలో అడుగుపెట్టినప్పటి నుం చీ అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయంటూ ఉదహరించుకుంటున్నారు. సమైక్య ఉద్యమం సమయంలో దారుణంగా ఉన్న టీడీపీ పరిస్ధితి ఇప్పుడిప్పుడే పుంజుకుంటుందని భావిస్తున్న సమయంలో ఈ బృందం చేరిక పార్టీకి పెద్ద షాకయింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, శానససభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాస్, చింతలపూడి వెంకట్రామయ్య, పంచకర్ల రమేష్‌బాబు, యూవీ రమణమూర్తి (కన్నబాబు)లు తెలుగుదేశంలోకి రావడం పట్ల జిల్లాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అనుచరులెవరూ వీరివెంట రాలేదు. 30 సంవత్సరాలుగా కొనసాగుతున్న క్యాడర్ వీరిరాకను వ్యతిరేకిస్తోంది. వీరితో వేగేదెలా అన్న సందిగ్ధం అధిష్టానాన్ని వెంటాడుతోంది. నిన్నటి వరకూ పార్టీ అధినేత చంద్రబాబును అవినీతి పరుడు,రాష్ట్రాన్ని విడగొట్టిన అసమర్ధుడు అని విమర్శించిన గంటా బృందం ఇప్పుడు ఎలా ఆయనను సమర్ధిస్తుందని టీడీపీ నేతలే ప్రశ్నిస్తున్నారు. కన్నబాబుకు వ్యతిరేకంగా యలమంచిలి కాంగ్రెస్ కార్యకర్తలు మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి ఆయనతో వెళ్లేదే లేదని తేల్చిచెప్పారు. కన్నబాబు పదేళ్లుగా తమను వేధింపులకు గురిచేసి, తప్పుడు కేసులతో అరెస్టు చేయించారని టీడీపీ నేతలు కార్యకర్తలు మండిపడుతున్నారు. అడారి తులసీరావు కుమార్తెను కూడా అరెస్టు చేసిన కన్నబాబును నేతగా అంగీకరించేదే లేదని చెబుతున్నారు. గంటా అనకాపల్లిలో వ్యాపార భాగస్వామి భాస్కర్‌కు పగ్గాలు అప్పగించి అరాచకం సృష్టించారని, చివరకు పార్టీ వ్యవస్ధాపకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరింపజేయకుండా అడ్డుకొన్నారని అక్కడి పార్టీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. భీమిలిలో ముత్తంశెట్టిదీ ఇదే పరిస్ధితి. ఆయనకు టికెట్ ఇస్తే ఓటమితప్పదని మాజీ శానసభ్యుడు అప్పల నరసింహరాజు స్పష్టం చేశారు. హిందుజా కంపెనీ ఏజెంట్‌గా వ్యవహరించి టీడీపీ నేతలపై పోలీసులను ఉసిగొల్పిన పంచకర్లను ఎలా అంగీకరించాలని ఉత్తర నియోజక వర్గ నేతలు ప్రశ్నిస్తున్నారు. యాదవుల సీటును మరో వర్గానికి చెందిన పంచకర్లకు కేటాయిస్తే సహించేది లేదని ఆ సంఘ నేతలు ఇప్పటికే గట్టి హెచ్చరికలు పంపారు. గంటా రాజకీయం కారణంగా టికె ట్ రేసులోనే లేని వెంకట్రామయ్య వెంట వెళ్లేదే లేదని గాజువాక కాంగ్రెస్ నేతలు సమావేశంలోనే బహిరంగంగా చెప్పారు. ఆయన పోటీలో లేనప్పుడు ఆయనతో మనకె ందుకని దేశం క్యాడర్ దూరంగా వుంది. పలు పార్టీలు మారి దేశంలో చేరిన వుడా మాజీ చైర్మన్ ఎస్ఏ రహ్మాన్ ఆ సామాజిక వర్గంలోనే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. మత్స్యకార వర్గానికి చెందిన పార్టీ నగర అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్‌ను కాదని రహ్మాన్‌కు టికెట్ ఇస్తే తఢాకా చూపుతామని మత్స్యకారనేతలు స్పష్టంచేస్తున్నారు. ఈ పరిస్ధితుల నేపథ్యంలో గంటా బృందం చేరిన తరువాత విశాఖలో టీడీపీ పరిస్ధితి పెనం మీది నుంచి పొయిలో పడ్టట్లైంది. -
నిరుత్సాహపు నీడలు
తెలుగుదేశం పార్టీ ‘గర్జన’ నీరుగారుతోంది. పార్టీ అధినేత ఎదుట తమ బలాన్ని నిరూపించుకునేందుకు గంటా బృందం ఎంతో ఆర్భాటంగా నిర్వహించ తలపెట్టిన ఈ కార్యక్రమ వేదిక ఇంకా ఖరారు కాకపోవటంపై టీడీపీ నేతలు ఆందోళన పడుతున్నారు. అనుకున్నట్లుగా బుధవారంనాడే గర్జనను నిర్వహించాలంటే ఈ రెండు రోజుల వ్యవధి చాలదని, వాయిదా వేయక తప్పదని భావిస్తున్నారు. విశాఖపట్నం: తెలుగుదేశం ప్రజాగర్జన సభ వాయి దా పడనుంది. ఈనెల 12న పార్టీ అధినేత నారా చంద్రబాబు హాజరయ్యే ఈ సభను ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో భారీస్థాయిలో నిర్వహించాలని పార్టీలోకి కొత్తగా చేరిన గంటా బృందం ఉవ్విళ్లూరింది. భారీస్థాయి జనసమీకరణ ద్వారా తమ బలం నిరూపించుకోవాలనుకుంది. చివర్లో సభా వేదిక అందుబాటులో లేకపోవడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని పార్టీ నేతలు తలపోస్తున్నారు. వాస్తవానికి ప్రజాగర్జనను ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈలోపు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో విద్యాసంస్థల ఆవరణల్లో బహిరంగ సభలు నిర్వహించకూడదని సీపీ శివధరరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏయూ వీసీ రాజు, ఇతర అధికారులు మాత్రం గంటా బృందానికి సాగిలపడి సభ నిర్వహించుకునేందుకు వీలుగా మద్దతుగా నిలిచారు. దీనిని సీపీ మాత్రం గట్టిగా వ్యవహరించారు. ఏయూ మైదానంలో నిర్వహించడానికి ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో సభ ఎక్కడ నిర్వహించాలనే దానిపై ప్రస్తుతం నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే ప్రత్యామ్నాయంగా విశాలక్షి నగర్‌లోని విశాఖపట్నం వెటర్నరీ కో-ఆపరేటివ్ సొసైటీ స్థలంలో సభ ఏర్పాటు చేయాలని భావించారు. వన్‌టౌన్ ప్రాంతంలోని మరో మైదానం కూడా పరిశీలించారు. ఆదివారం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జుల సమావేశంలో తూర్పు నియోజకవర్గం పరిధిలో ఎక్కువగా జనం వచ్చే వీలుందని పలువురు సూచించారు. సభా వేదికకు అనువైన స్థలం సిద్ధంగా ఉన్నా ఇంకా రెండురోజుల వ్యవధిలో ఏర్పాట్లు చేయడం సాధ్యమని తేల్చారు. దీంతో ప్రస్తుతం గంటా బృందం వెనుకడుగు వేస్తోంది. స్వల్ప వ్యవధిలో బహిరంగసభ నిర్వహిస్తే జనసమీకరణ ఇబ్బందిగా మారి తాము పార్టీలో చేరే విషయం పెద్దగా గుర్తింపులోకి రాదని భావిస్తున్నారు. ఈనేపథ్యంలో సభ వాయిదావేయాలా? వద్దా?అనేది సోమవారం నగరానికి రానున్న పార్టీ సీనియర్ నేతలు గరికపాటి,యనమలతో కలిసి మాట్లాడి నిర్ణయించనున్నారు. -
విశాఖలో దేవధర్ ట్రోఫీ
విశాఖపట్నం : ప్రతిష్టాత్మక జోనల్ వన్డే టోర్నీ... దేవధర్ ట్రోఫీకి విశాఖపట్నం వేదిక కానుంది. ఇక్కడి వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఈనెల 23 నుంచి టోర్నీ జరుగుతుంది. తొలి మ్యాచ్‌లో సెంట్రల్ జోన్- ఈస్ట్ జోన్ తలపడతాయి. ఇందులో గెలిచిన జట్టు 25న జరిగే సెమీస్‌లో వెస్ట్‌జోన్‌తో తలపడుతుంది. మరో సెమీస్ 24న నార్త్, సౌత్ల మధ్య జరుగుతుంది. 27న ఫైనల్ జరగనుంది. -
శోకసంద్రం
హిరమండలం, గొట్టాబ్యారేజీ వద్ద స్నానానికి దిగి గల్లంతైన విద్యార్థులు మృత్యువాతపడ్డారు. మృతదేహాలను శుక్రవారం వెలికి తీశారు. గల్లంతైన విద్యార్థుల కోసం వచ్చిన వారి మృతుల బంధువులు, స్నేహితులతో గొట్టాబ్యారేజీ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మృతదేహాలను చూసిన వారి రోదనలు ఆ ప్రాంతంలో మిన్నంటాయి. విశాఖపట్నం జిల్లాకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు గిరిజాల కిశోర్‌కుమార్, గందేసు అప్పలరెడ్డి, బర్రి అజయ్ కుమార్ గురువారం సాయంత్రం హిరమండలం సమీపంలో గల గొట్టాబ్యారేజీ వద్ద వంశధార నదిలో స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. ఈ సమాచారం తెలియడంతో వారి మృతదేహాల కోసం పోలీసులు, కొత్తూరు అగ్నిమాపక సిబ్బంది రాత్రంతా గాలించారు. ఫలితం లేకపోయింది. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి పది గంటల వరకు 30 మంది గజ ఈతగాళ్లు తీవ్రంగా గాలించి మృతదేహాలను వెలికితీశారు. కుటుంబానికి ఆసరాగా ఉంటారనుకుంటే.... కుటుంబానికి ఆసరాగా ఉంటారనుకుంటే ఇలా అర్దంతరంగా తనువు చాలించారని మృతుల బంధువులు రోదించారు. ముగ్గురూ మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు. కిశోర్ రాజు తండ్రి వెంకటరావు లారీ డ్రైవర్‌గా, అజయ్ కుమార్ తండ్రి గుర్నాథరావు కార్పెంటర్‌గా, అప్పలరెడ్డి తండ్రి ముసలయ్య స్టీల్‌ప్లాంట్‌లో పనిచేస్తున్నారు. ముసలయ్య, భూలోకమ్మల ఏకైకసంతానం అప్పలరెడ్డి. ఒక్క కుమారుడు వంశధారకు బలవడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. అజయ్‌కుమార్ తండ్రి గుర్నాథరావు రెండు రోజుల కిందట షిప్‌యార్డులో కూలీగా వెళ్లారు. కన్నకొడుకు మృతదేహాన్ని చూసేందుకు కూడా రాలేకపోయాడని అతని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. అజయ్‌కుమార్ మృతదేహాన్ని చూసిన అతని పెదనాన్న బర్రి అప్పలరాజు సంఘటన స్థలంలో బిగ్గరగా రోదిస్తుంటే వారించేందుకు పలువురు ప్రయత్నించారు. కిశోర్‌కుమార్ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు వెంకటరావు, ప్రభావతి తట్టుకోలేకపోయారు. హృద్రోగి అయిన ప్రభావతి విలపిస్తూ భావోద్వేగంతో కుప్పకూలిపోయారు. దీంతో ఆమెను అక్కడి నుంచి బంధువులు దూరంగా తీసుకువెళ్లారు. ఎక్కడో పుట్టి.. ] ఎక్కడో పుట్టి ఇక్కడ తనువు చాలించారని సంఘటన స్థలంలో పలువురు విచారం వ్యక్తం చేశారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన వారు విజయనగరంలో చదువుకుంటూ శ్రీముఖలింగేశ్వరుని దర్శించుకునేందుకు జలుమూరు మండలం మర్రివలసలోని మిత్రుడు ప్రవీణ్‌కుమార్ ఇంటికి వచ్చారు. ఆలయంలో రద్దీగా ఉందని నది వద్దకు వెళ్లారని, శ్రీముఖలింగేశ్వరుడి సన్నిధిలో ఉంటే మృత్యువాత పడేవారు కారని కొందరు అన్నారు. జనసంద్రమైన గొట్టా బ్యారేజీ ప్రమాదానికి గురైన విద్యార్థుల గురించి తెలియడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, స్థానికులు తరలి రావడంతో గొట్టాబ్యారేజీ జనసంద్రమైంది. సంఘటన స్థలికి విజయనగరం జిల్లా గరివిడి మండలంలోని అవంతి సెయింట్ థెరిసా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్య ప్రతినిధులు శ్రీధర్, మహేష్ వచ్చారు. మృతదేహాలను చూసి అక్కడ ఉన్నవారంతా కన్నీరు పెట్టారు. మృతదేహాలను పోసుమ్టమార్టం నిమిత్తం పాతపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మధ్యాహ్నం మృతదేహాలను వారి స్వగ్రామాలకు తరలించారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి గొట్టాబ్యారేజి వద్ద హెచ్చరిక బోర్డులు పెద్దవి ఏర్పాటు చేయాలని కలెక్టర్ సౌరభ్‌గౌర్ అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వంశధార అధికారులతో మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన చిన్న బోర్డులను తొలగించి పెద్ద బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఆ బోర్డులపై ఇప్పటివరకు జరిగిన ప్రమాదాల వివరాలు పొందుపర్చాలని చెప్పారు. సందర్శకులు ఎక్కువ మంది ఉంటే ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులకు తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్ల గురించి పలు సూచనలు చేశారు. -
ముగ్గురికి డౌటే..
జిల్లా నుంచి ఇద్దరికే టికెట్ ఛాన్స్ ముత్తంశెట్టి, చింతలపూడిలకువ్యతిరేకంగా నివేదిక చక్రం తిప్పిన గంటా కన్నబాబుకు లభించని హామీ బాబును కలిసిన గంటా బృందం 3న దేశంలో చేరికకు ముహూర్తం? సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పదవే పరమావధిగా రాజకీయాలు చేస్తున్న గంటా శ్రీనివాసరావు బృందంలో టికెట్ చిచ్చు రేగుతోంది. ప్రజారాజ్యం శాసనసభ్యులుగా ఎంపికై కాంగ్రెస్‌లో కొనసాగుతున్న గంటా బృందం రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకొన్న సంగతి తెలిసిందే. గంటా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్‌బాబు, చింతలపూడి వెంకట్రామయ్య, ముత్తంశెట్టి శ్రీనివాస్‌లతో పాటు యలమంచిలి శాసనసభ్యుడు యూవీ రమణమూర్తి(కన్నబాబు) గు రువారం హైదరాబాద్‌లో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును కలిశారు. అంతవరకూ బాగానే ఉన్నా గంటా రాజకీయం కారణంగా చంద్రబాబును కలసిన వారిలో ముగ్గురికి జిల్లానుంచి పోటీ చేసేందుకు హామీ లభించకపోవడం చర్చనీయాంశంగా మారింది. గంటా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్‌బాబు బాబులకు టికెట్ హామీ లభించగా, మిగిలిన ముగ్గురి భవితవ్యం గందరగోళంలో పడింది. ప్రతి ఎన్నికలోనూ సీటును మార్చే గంటా శ్రీనివాసరావు ఈ పర్యాయం భీమిలి లేదా గాజువాక నుంచి పోటీ చేసే ఉద్దేశంతో పీఆర్పీ సహచరులైన ప్రస్తుత శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాస్,చింతలపూడి వెంకట్రామయ్యలకు వ్యతిరేకంగా నివేదికలు ఇప్పించారని తెలిసింది. తెలుగుదేశంలో కీలకభూమిక పోషిస్తున్న రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్‌ల ద్వారా గంటా ఈ వ్యవహారాన్ని నడిపించారని తెలుగుదేశం నేతలే ఆరోపిస్తున్నారు. మంత్రిగా పనిచేసిన గంటా కంటే ఎక్కువగా తమ నియోజక వర్గాల్లో వందల కోట్లతో అభివృద్ది పనులు చేయించిన వెంకట్రామయ్య, శ్రీనివాస్‌లకు వారి నియోజక వర్గాల్లో వ్యతిరేకత వుందన్న నివేదికలు గంటా బృందంలో విబేధాలను పెంచుతున్నాయి. ఈ నివేదిక ఆధారంగా వెంకట్రామయ్య తెలుగుదేశంలో చేరినప్పటికీ టికెట్ వుండదని ప్రచారం జరుగుతోంది. ఇక ముత్తంశెట్టి శ్రీనివాస్ భీమిలి నుంచి గాక విజయనగరం జిల్లా నెల్లిమర్ల లేదా చీపురుపల్లి నియోజక వర్గాల నుంచి పోటీ చేయించాలని సూచించడం కూడా వివాదాస్పదంగా మారింది. వెంకట్రామయ్య, శ్రీనివాస్‌లకు వ్యతిరేకంగా ఇచ్చిన నివేదికలో అనకాపల్లినుంచి గంటా వ్యాపార భాగస్వామి అయిన పరుచూరి భాస్కరరావు అభ్యర్ధి అయితే బాగుంటుందని సూచించడం గంటా మార్కు రాజకీయానికి నిదర్శనంగా మారింది. దుందుడుకువైఖరి, వివాదాస్పద నిర్ణయాలతో అనకాపల్లివాసుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న భాస్కర్‌కు పెద్దపీట వేసి వెంకట్రామయ్య, శ్రీనివాస్‌లను తప్పించడం గంటా బృందంలో విబేధాలను పెంచుతోంది. పలు కుంభకోణాల్లో, కేసుల్లో చిక్కుకొన్న యలమంచలి శాసనభ్యుడు కన్నబాబు మరో గత్యంతరం లేక టికెట్ హామీతో సంబంధం లేకుండానే చంద్రబాబును కలిశారు. అవకాశం ఇస్తే అనకాపల్లి ఎంపీ సీటుకు సిద్ధమని కన్నబాబు చెబుతున్నా తెలుగుదేశం అధినేత నుంచి స్పందన రాలేదు. గంటాతోపాటు నలుగురు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలో మార్చి మూడో తేదీన చేరనున్నారు. ముందుగా పార్టీ విశాఖలో మహిళా గర్జన సదస్సు నిర్వహిస్తున్న ఎనిమిదిన చేరాలనుకొన్నా, ఆ సమావేశం మహిళలకు ఉద్దేశించినదన్న కారణంగా ముహూర్తాన్ని ముందుకు జరిపారు. మూడవ తేదీన చంద్రబాబు విశాఖ వచ్చే అవకాశం లేకపోవడంతో వీరే హైదరాబాద్ వెళ్లి పార్టీలో చేరనున్నారు. -
చేరికలా..చేదుగుళికలా..
విశాఖపట్నం: కొత్త నేతల చేరికలు జిల్లా తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు పెద్దతలనొప్పి తె చ్చిపెడుతున్నాయి. ఇంతకాలం అధికారంలో వుండి తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలను ఇబ్బందుల పాల్జేశారనే విమర్శలెదుర్కొంటున్న మంత్రి గంటా శ్రీనివాసరావు బృందాన్ని అడ్డుకొనేందుకు సీనియర్లు, బీసీ నేతలు ఏకతాటిపైకి రావడంతో పరిస్ధితి గందరగోళంగా మారింది. పీఆర్పీ తరపున ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ శాసనసభ్యులుగా కొనసాగుతున్న గంటా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్‌బాబు, ముత్తంశెట్టి శ్రీనివాస్, చింతలపూడి వెంకట్రామయ్యలను తెలుగుదేశం పార్టీలోేర్చుకొంటే తాము పార్టీని వీడతామంటూ పలువురు బీసీ నేతలు, సీనియర్లు హెచ్చరిస్తుండడంతో చంద్రబాబుకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. మాజీ మున్సిపల్ రామారావు నేతృత్వంలోని బీసీ సంఘాల నేతలు మంగళవారం బస్సుల్లో హైదరాబాద్ వెళ్లి చంద్రబాబును కలసి పార్టీలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. గంటా బృందం వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం వుండ దని వివరించారు. అనకాపల్లిలో గంటా, పెందుర్తిలో పంచకర్ల తెలుగుదేశం నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టించి అరెస్టులు చేయించారని అటువ ంటి వారిని పార్టీలోకి తీసుకొంటే ఎప్పటినుంచో ఉన్న క్యాడర్ దూరమవుతుందనివివరించినట్లు తెలిసింది. ఇక, బుధవారం విజయనగరంలో జరగనున్న పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు ఉదయం విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్న చంద్రబాబును ఈ విషయమై క లసేందుకు నగరంలోని పార్టీ బీసీ నేతలు సిద్ధమౌతున్నారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించిన దేశం పార్టీ విశాఖలో బీసీలను కాదని ఓసీలకు, పార్టీల నుంచి వలస వచ్చిన వారికి ప్రాధాన్యతనిస్తే పార్టీని వీడేందుకు సిద్ధమని భరణికాన రామారావు నేతృత్వంలోని పలువురు చంద్రబాబుకు స్పష్టం చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. రెండు రోజుల క్రితం నగరానికి వచ్చిన పార్టీ ఎంఎల్సీ, సీనియర్‌నేత యనమల రామకృష్ణుడును కలసిన బీసీ సంఘాల నేతలు ఈ విషయాన్ని ఆయనతో చర్చించి నిర్ణయాన్ని స్పష్టం చేశారు. గంటా బృందం తెలుగుదేశంలో చేరకముందే తాము పోటీచేయనున్న అసెంబ్లీ సీట్లపై ప్రచారాన్ని సాగించడం కూడా వివాదాస్పదంగానే మారింది. -
రాలిన మరో విద్యా కుసుమం
విశాఖపట్నం, న్యూస్‌లైన్: చదువుల ఒత్తిడితో మరో విద్యాకుసుమం నేల రాలింది. మధురవాడ గాయత్రీ ఇంజినీరింగ్ కాలేజీలో రెండో సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతున్న నాగులాపల్లి ఓంకార్ మెకానికల్ డిప్లొమా పూర్తి చేశాడు. మూడు నెలల క్రితం గాయత్రి ఇంజినీరింగ్ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం సీఎస్సీ గ్రూపులో చేరి హాస్టల్లో ఉంటున్నాడు. ఈ సబ్జెక్టు తనకు అంతగా అర్థంకావడంలేదని ఎప్పుడూ మథనపడుతూ ఉండేవాడని తోటి విద్యార్థులు పేర్కొన్నారు. ఉదయం ఓంకార్ తరగతులకు వెళ్లకుండా హాస్టల్లోనే ఉండిపోయాడు. సహచర విద్యార్థులు లంచ్‌బ్రేక్‌లో హాస్టల్‌కు వెళ్లినప్పుడు అతను ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణం చెందాడు.