‘వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాకే పెళ్లి’ | Kalluru Kottapalem Man Pledge | Sakshi
Sakshi News home page

‘వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాకే పెళ్లి’

Published Mon, Nov 27 2017 11:16 AM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM

Kalluru Kottapalem Man Pledge - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, వాకాడు: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యే వరకు తాను పెళ్లి చేసుకోనని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వాకాడు మండలం కల్లూరు కొత్తపాళెం గ్రామానికి చెందిన రాయిపు రవీంద్ర అనే 27 ఏళ్ల పీజీ విద్యార్థి ఆదివారం జరిగిన పెళ్లి చూపుల్లో శపథం చేశారు. ఆదివారం రాయిపు రవీంద్రకు తన బంధువుల అమ్మాయితో గ్రామంలో పెళ్లి చూపులు జరిగాయి. రవీంద్ర మాట్లాడుతూ డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఫీజు రీయంబర్స్‌మెంట్‌తో తాను పీజీ చేశానని తెలిపారు.         

                    
నెల్లూరు విక్రమసింహపురి వర్సిటీలో 2015లో ఎంకాం పూర్తి చేయగా మూడేళ్లుగా నేటి ప్రభుత్వంలో ఉద్యోగం సంపాదించడం అందని ద్రాక్షలా మారిందన్నారు. ఈ ప్రభుత్వం ఇంటికో ఉద్యోగమని నమ్మబలికి ఉన్న ఉద్యోగాలను కూడా తీసేస్తోందన్నారు. ఉద్యోగాలు రావాలంటే వైఎస్‌ జగన్‌ సీఎం కావాలని, అప్పుడే తాను పెళ్లి చేసుకుంటానని రవీంద్ర తన దైవం సాక్షిగా ప్రమాణం చేశాడు. దీంతో వచ్చిన బంధువులు కూడా అలాగే చేద్దామంటూ అతనికి మద్దతు పలికారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement