కర్నూలు : కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్య కేసులో ప్రధాన నిందితుడు దివాకర్ నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక హుబ్లీ రైల్వే స్టేషన్లో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్య కేసులో 21 మందికి జీవిత ఖైదు విధిస్తూ ఆదోని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఇటీవల తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.
ఈ హత్య కేసులో 48 మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా... 21 మందికి జీవిత ఖైదు విధించారు. అయితే కోర్టు తీర్పు ముందే దివాకర్ నాయుడు పరారీలో ఉన్నాడు. అతడు తన భార్యతో రైల్వే స్టేషన్లో ఉండగా, ఫోన్ కాల్స్ ఆధారంగా పోలీసులు ఆచూకీ తెలుసుకున్నట్లు సమాచారం.
కాగా 2008, మే 17నే కప్పట్రాళ్ల నుంచి వెంకటప్పనాయుడు ఆయన అనుచరులు వాహనంలో కోడుమూరుకు బయలుదేరారు. ఆయన్ని హత్య చేయాలని పథకం పన్ని న ప్రత్యర్థులు ముందుగానే మాచాపురం వద్ద మాటు వేశారు. అటుగా వస్తున్న కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు వాహనాన్ని లారీతో ఢీ కొట్టారు. అనంతరం ప్రత్యర్థులు బాంబులతో దాడి చేసి హత్య చేశారు. ఈ దాడిలో కప్పట్రాళ్లతోపాటు ఆయన అనుచరులు 10 మంది మరణించారు.
'కప్పట్రాళ్ల' హత్యకేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్
Published Wed, Dec 31 2014 8:38 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
Advertisement