తుంగభద్ర రిజర్వాయర్ నుంచి మనవాటా నీటిని విడుదల చేసేందుకు పొరుగురాష్ట్రం కర్ణాటక కొత్తసాకులు వెదుకుతోంది. అక్కడి రైతుల అభ్యంతరాల సాకుగా చూపుతూ కాలం గడిపేస్తోంది. మన అధికారులు ఇండింట్ పెట్టినా తుంగభద్ర బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మన జిల్లాలో ఆర్డీఎస్ ఆయకట్టులో చివరిదశలో ఉన్న పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది.
గద్వాల, న్యూస్‌లైన్: మనరాష్ట్ర వాటాను తుంగభద్ర రిజర్వాయర్ నుంచి నది లోకి విడుదల చేయడానికి కర్ణాటక కొత్తరకం కొర్రీని తెరపైకి తెచ్చింది. తుంగభ ద్ర నది ఎండితే ఇబ్బంది వస్తుందని రై తులు అభ్యంతరం చెబుతున్నారని ఈ నెల పదో తేదీ నుంచి ఇప్పటివరకు నీటి ని విడుదల చేయకుండా వాయిదాలతో కాలం గడుపుతోంది. ఆర్డీఎస్ వాటా 11 టీఎంసీలు, కర్ణాటకలోని సిరిగుప్ప వా టా ఐదు టీఎంసీలు.. ఇలా మొత్తం 16 టీఎంసీల నీటిని తుంగభద్ర రిజర్వాయ ర్ నుంచి విడుదల చేయాల్సి ఉంది.
ఇ ప్పటివరకు కర్ణాటక అధికారులు తుంగభద్ర బోర్డులో తమ ఆధిపత్యాన్ని అడ్డుపెట్టుకొని కేవలం మూడు టీఎంసీల నీ టిని మాత్రమే విడుదల చేశారు. ఇంకా 13 టీఎంసీల నీటిని వాటాగా తుంగభ ద్ర నదిలోకి విడుదల చేయాల్సి ఉంది. వాస్తవానికి ఆర్డీఎస్ ఆయకట్టు పరిధిలో ఆలస్యంగా పంటలు సాగుచేసుకోవడం తో ఒకే పంటగా మొత్తం నీటిని వాడుకు నే అవకాశం ఉంది. ఆర్డీఎస్ అధికారు లు కర్నూలు ఎస్‌ఈకి నీటి విడుదలపై లేఖ రాయడం, అ క్కడి నుంచి తుంగభ ద్ర బోర్డుకు ప్రతిపాదనలు పంపించినా స్పందించడం లేదు.
కర్ణాటక కొత్త కారణం
నీటిని విడుదల చేయకపోవడానికి కర్ణాటక సాకులు చూపుతోంది. తుంగభద్ర నది ఎండితే తాగునీళ్లు, ఎత్తిపోతల పథకాలు, ఇతర అవసరాలకు నష్టం జరుగుతుందని అక్కడి రైతులు అభ్యంతరం చెబుతున్నారని తుంగభద్ర బోర్డులోని అధికారులు చెబుతున్నారు. దీనికితోడు ఇండెంట్‌కు లేఖలు పంపినా బోర్డులో నిర్ణయం తీసుకోవడంలో వాయిదాలు వేస్తూ పక్షంరోజులుగా కాలం గడిపేస్తున్నారు. ఇలాగే మరికొద్ది రోజులు నీటిని విడుదల చేయకుండా కాలయాపన చేస్తే అల ంపూర్, గద్వాల నియోజకవర్గాల్లోని ఆర్డీఎస్ ఆయకట్టులో దాదాపు 18వేల ఎకరాల పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. లక్షలాది రూపాయలను పెట్టుబడిగా పెట్టి పంటలు సాగుచేసుకున్న రైతులకు తుంగభద్ర నీళ్లు రాకపోతే పంటలు ఎండిపోయి నష్టం తప్పదు.
కర్ణాటక కొర్రీ!
Published Wed, Feb 26 2014 4:12 AM | Last Updated on Sat, Sep 2 2017 4:05 AM
Advertisement