Board officers
-
క్రమం...అక్రమం!
- గ్రేటర్ పరిధిలో లక్షకు పైగా అక్రమ నల్లాలు - నత్త నడకన క్రమబద్ధీకరణ - సిబ్బంది నిర్వాకంతో అడ్డంకులు సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో అక్రమ నల్లాల క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రహసనంగా మారుతోంది. జలమండలి క్షేత్ర స్థాయి సిబ్బంది నిర్వాకమే దీనికి కారణంగా తెలుస్తోంది. మహా నగర పరిధిలో లక్షకు పైగా అక్రమనల్లాలు ఉన్నట్టు బోర్డు అధికారులే బహిరంగంగా చెబుతున్నారు. అయినా ఏడాది కాలంలో కేవలం 15 వేల నల్లాలను మాత్రమే క్రమబద్ధీకరించడం గమనార్హం. వినియోగదారుల నుంచి నామమాత్రంగా డిక్లరేషన్ తీసుకొని కనెక్షన్ చార్జీ వసూలు చేసి... క్రమబద్ధీకరించాలని ఉన్నతాధికారులు చెబుతున్నారు. క్షేత్ర స్థాయి అధికారులు మాత్రం సవాలక్ష కొర్రీలతో వినియోగదారులకు చుక్కలు చూపుతున్నారు. సంబంధిత భవంతికి మున్సిపల్ లేదా గ్రామ పంచాయతీ ధ్రువీకరణ, విద్యుత్ కనెక్షన్లు ఉన్నప్పటికీ ఆక్యుపెన్సీ, లింక్ డాక్యుమెంట్లు, అఫిడవిట్లు సమర్పించాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో పలువురు క్రమబద్ధీకరణకు వెనుకంజ వేస్తున్నారు. బోర్డు ఆదాయానికి నెలకు రూ.పది కోట్ల మేర గండి పడుతున్నట్లు అంచనా. గ్రేటర్లో విలీనమైన 11 శివారు మున్సిపల్ సర్కిళ్లలోని కాలనీలు, బస్తీలు, పంచాయతీల్లో ప్రస్తుతం ఇదే దుస్థితి నెలకొంది. బోర్డు ఖజానాకు భారీగా గండి గ్రేటర్ పరిధిలోని 16 నిర్వహణ డివిజన్లలో జలమండలికి 8.64 లక్షల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. నీటి బిల్లులు, ట్యాంకర్లతో నీటి సరఫరా, మురుగు శిస్తు కలిపి జలమండలికి నెలకు రూ.91 కోట్ల మేర ఆదాయం లభిస్తోంది. కానీ వ్యయం రూ.93 కోట్లుగా ఉంది. అంటే నెలకు రూ.2 కోట్ల లోటుబడ్జెట్‌తో నెట్టుకొస్తోందన్నమాట. ఈ నేపథ్యంలో నగరంలో మరో లక్ష అక్రమ కనెక్షన్లను క్రమబద్ధీకరిస్తే ఆదాయం నెలకు రూ.100 కోట్లకు మించే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న మేనేజర్లు, డీజీఎంలు, జీఎంల నిర్వాకంతో క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రహసనంగా మారుతోంది. 189 మంది అక్రమార్కుల గుర్తింపు గ్రేటర్ పరిధిలో గత ఎనిమిది నెలలుగా అక్రమ కనెక్షన్లు, బహుళ అంతస్తుల భవంతులకు గృహ వినియోగ కనెక్షన్లు ఉండడం, ఎక్కువ మొత్తంలో నీటిని వాడుకుంటూ... నల్లా పరిమాణాన్ని తక్కువ చూపుతున్న కేసులను 189 వరకు బోర్డు విజిలెన్స్ విభాగం గుర్తించింది. ఇందులో అక్రమ కనెక్షన్లు ఉన్న పది మంది వినియోగదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. పక్కాగా సమాచారం అందితేనే విజిలెన్స్ సిబ్బంది రంగంలోకి దిగుతున్నారు. దీంతో అక్రమాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. -
కర్ణాటక కొర్రీ!
తుంగభద్ర రిజర్వాయర్ నుంచి మనవాటా నీటిని విడుదల చేసేందుకు పొరుగురాష్ట్రం కర్ణాటక కొత్తసాకులు వెదుకుతోంది. అక్కడి రైతుల అభ్యంతరాల సాకుగా చూపుతూ కాలం గడిపేస్తోంది. మన అధికారులు ఇండింట్ పెట్టినా తుంగభద్ర బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మన జిల్లాలో ఆర్డీఎస్ ఆయకట్టులో చివరిదశలో ఉన్న పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. గద్వాల, న్యూస్‌లైన్: మనరాష్ట్ర వాటాను తుంగభద్ర రిజర్వాయర్ నుంచి నది లోకి విడుదల చేయడానికి కర్ణాటక కొత్తరకం కొర్రీని తెరపైకి తెచ్చింది. తుంగభ ద్ర నది ఎండితే ఇబ్బంది వస్తుందని రై తులు అభ్యంతరం చెబుతున్నారని ఈ నెల పదో తేదీ నుంచి ఇప్పటివరకు నీటి ని విడుదల చేయకుండా వాయిదాలతో కాలం గడుపుతోంది. ఆర్డీఎస్ వాటా 11 టీఎంసీలు, కర్ణాటకలోని సిరిగుప్ప వా టా ఐదు టీఎంసీలు.. ఇలా మొత్తం 16 టీఎంసీల నీటిని తుంగభద్ర రిజర్వాయ ర్ నుంచి విడుదల చేయాల్సి ఉంది. ఇ ప్పటివరకు కర్ణాటక అధికారులు తుంగభద్ర బోర్డులో తమ ఆధిపత్యాన్ని అడ్డుపెట్టుకొని కేవలం మూడు టీఎంసీల నీ టిని మాత్రమే విడుదల చేశారు. ఇంకా 13 టీఎంసీల నీటిని వాటాగా తుంగభ ద్ర నదిలోకి విడుదల చేయాల్సి ఉంది. వాస్తవానికి ఆర్డీఎస్ ఆయకట్టు పరిధిలో ఆలస్యంగా పంటలు సాగుచేసుకోవడం తో ఒకే పంటగా మొత్తం నీటిని వాడుకు నే అవకాశం ఉంది. ఆర్డీఎస్ అధికారు లు కర్నూలు ఎస్ఈకి నీటి విడుదలపై లేఖ రాయడం, అ క్కడి నుంచి తుంగభ ద్ర బోర్డుకు ప్రతిపాదనలు పంపించినా స్పందించడం లేదు. కర్ణాటక కొత్త కారణం నీటిని విడుదల చేయకపోవడానికి కర్ణాటక సాకులు చూపుతోంది. తుంగభద్ర నది ఎండితే తాగునీళ్లు, ఎత్తిపోతల పథకాలు, ఇతర అవసరాలకు నష్టం జరుగుతుందని అక్కడి రైతులు అభ్యంతరం చెబుతున్నారని తుంగభద్ర బోర్డులోని అధికారులు చెబుతున్నారు. దీనికితోడు ఇండెంట్‌కు లేఖలు పంపినా బోర్డులో నిర్ణయం తీసుకోవడంలో వాయిదాలు వేస్తూ పక్షంరోజులుగా కాలం గడిపేస్తున్నారు. ఇలాగే మరికొద్ది రోజులు నీటిని విడుదల చేయకుండా కాలయాపన చేస్తే అల ంపూర్, గద్వాల నియోజకవర్గాల్లోని ఆర్డీఎస్ ఆయకట్టులో దాదాపు 18వేల ఎకరాల పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. లక్షలాది రూపాయలను పెట్టుబడిగా పెట్టి పంటలు సాగుచేసుకున్న రైతులకు తుంగభద్ర నీళ్లు రాకపోతే పంటలు ఎండిపోయి నష్టం తప్పదు. -
నీటి వాటాలో కోత
కర్నూలు రూరల్, న్యూస్‌లైన్: తుంగభద్ర దిగువ కాలువ, కర్నూలు-కడప కాలువల వాటాల్లో మళ్లీ కోత పడింది. నీటి వాటా పంపకాలపై గురువారం కర్ణాటక రాష్ట్రం హోస్పేటలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) వాటా నీటిలో 0.4 టీఎంసీ, కేసీ వాటాలో 0.3 టీఎంసీ నీటిని తగ్గిస్తున్నట్లు బోర్డు అధికారులు ప్రకటించారు. ఎల్లెల్సీ కింద రబీలో సాగు చేసిన ఆయకట్టు పంటలకు 4.06 టీఎంసీ నీరు రావాల్సి ఉంది. ప్రస్తుతం టీబీ డ్యామ్‌లో నీటి లభ్యత ఆధారంగానే వాటా తగ్గించినట్లు సమాచారం. కేసీ నీరు అనంతపురం జిల్లాకు మళ్లించడంతో ఇక మిగిలిన 0.8 టీఎంసీ వాటాలో కూడా 0.3 టీఎంసీ దాకా కోత పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే కేసీ కాలువ జీరో కి.మీ., నుంచి 150 కి.మీ. వరకు ఉన్న 29,500 ఎకరాల్లో పంటలకు చివరి తడికి నీరు ఇచ్చే అవకాశం ఉండదు. ప్రస్తుతం సుంకేసుల ప్రాజెక్టులో 1.15 టీఎంసీ నీరు ఉండగా, ఎగువ నుంచి 900 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఈ ప్రాజెక్టు నుంచే కర్నూలు నగర ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చేందుకు 2 టీఎంసీల నీరు అవసరం. సుంకేసులలో ఉన్న నీరు, టీబీ డ్యామ్‌లో మిగిలిన 0.5 టీఎంసీ నీరు వచ్చినా తాగునీటి అవసరాలు తీర్చడమే కష్టమని కొందరు అధికారులు చెబుతున్నారు. పాలకులకు ముందు చూపు లేకపోవడం.. అధికారులు అలసత్వం వల్లే కేసీ ఆయకట్టు రైతులకు నీరందని పరిస్థితులు నెలకొంటున్నాయి. హొస్పేటలో నిర్వహించిన సమావేశానికి నీటి పారుదల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ ఆర్.నాగేశ్వరరావు హాజరయ్యారు. దిగువ కాలువ వాటా నీటిలో కొంత మేరకు తగ్గించారని, ఫిబ్రవరి 1వ తేది నుంచి కేసీ వాటా నీరు టీబీ డ్యామ్ నుంచి విడుదల అవుతుందన్నారు. ఉన్న నీటినే కేసీ 12 రోజుల పాటు విడుదల చేస్తామని, ఆ తరువాత మూడో తడికి ఆలోచిస్తామని చెప్పారు.