
తిరుమల: శ్రీవారి ఆలయంలో గురువారం కార్తీక పౌర్ణమి దీపోత్సవం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఘనంగా నిర్వహించింది. సాయంత్రం శ్రీవారికి సాయంకాల కైంకర్యాల నివేదనలు పూర్తి అయిన అనంతరం దీపోత్సవం నిర్వహించారు. సాయంత్రం 5.00 నుంచి 8.00 గంటల వరకు ఈ ఉత్సవం జరిగింది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ దంపతులు కార్తీక దీపోత్సవంలో పాల్గొన్నారు. దీనికి ముందు వారు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరి కోసం అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటంతో సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment