తిరుపతి,సాక్షి: తిరుపతి తొక్కిసలాటలో (tirupati stampede) మరణించిన బాధితుల కుటుంబాల పట్ల టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు (br naidu) అత్యంత అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. వారికి అందించే నష్టపరిహారంలో ఒంటెద్దు పోకడను ప్రదర్శిస్తున్నారు.
తిరుమల తొక్కిస లాట బాధిత కుటుంబాలకు చంద్రబాబు ప్రభుత్వం టీటీడీ డబ్బులతో నష్టపరిహారం చెల్లిస్తోంది. అయితే ఈ నష్టపరిహారాన్ని చెల్లించేందుకు బీఆర్ నాయుడు ఏ ఒక్క బాధిత కుటుంబానికి వెళ్లలేదు. వారిని పరామర్శించడం లేదు. టీటీడీ సభ్యులు, టీడీపీ నేతల ద్వారా పరిహారం పంపిణీ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు.
తిరుపతి మహా విషాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మృతి చెందిన బాధిత కుటుంబాలకు టీటీడీ పాలక మండలి స్వయంగా క్షమాపణ చెప్పాలని వ్యాఖ్యానించారు. అయితే, పవన్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను బీఆర్ నాయుడు లెక్క చేయడం లేదు. విశాఖలో హోంమంత్రి అనిత, టీడీపీ ఎమ్మెల్యేల ద్వారా పరిహారం అందించి మమ అనిపిస్తున్నారు.
పైగా, ప్రభుత్వం తరుఫు నుంచి కాకుండా టీటీడీ డబ్బులతోనే మృతుల కుటుంబాలకు చంద్రబాబు ప్రభుత్వం ఈ ఎక్స్ గ్రేషియా చెల్లిస్తోంది. పరిహారం విషయంలో చంద్రబాబు, బీఆర్ నాయుడిపై శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు.
పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా?
క్షమాపణలు చెప్పితే పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా?.. ఎవరో ఏదో చెప్పారని మేం స్పందించాల్సిన అవసరం లేదంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కౌంటర్ ఇచ్చారు.
తొక్కిసలాట ఘటనకు టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్యచౌదరి, టీటీడీ చైర్మన్ బాధ్యత వహించాలని పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.. మృతుల కుటుంబాలకు టీటీడీ బోర్డు, పోలీసులు క్షమాపణ చెప్పాలన్నారు. తొక్కిసలాట జరుగుతుంటే పోలీసులు చోద్యం చూసినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. పోలీసుల వైఫల్యంపైనే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. క్రౌడ్ మేనేజ్‌మెంట్ సరిగా జరగలేదన్నారు.
మరోవైపు, టీటీడీ పాలకమండలి, ఈవో మధ్య వార్ కొనసాగుతోంది. అన్నమయ్య భవనంలో టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. పాలకమండలి సభ్యులకు కనీస సమాచారం ఇవ్వడం లేదంటూ ఈవోపై సభ్యులు మండినట్లు సమాచారం.
👉చదవండి : చింతించడం తప్ప చేసేదేమీ లేదు
Comments
Please login to add a commentAdd a comment