అనంతపురం కలెక్టరేట్,న్యూస్‌లైన్: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల బోధన, బోధనేతర సిబ్బంది సోమవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించారు. ధర్నాకు ఎమ్మెల్సీ గేయానంద్ మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కేజీబీవీల్లో పనిచేస్తున్న సిబ్బందికి కనీస వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిత్యావసర ధరలు పెరుగుతున్నా అందుకు తగ్గట్టు వేతనాలు పెరగడం లేదన్నారు.
కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వం జీఓ నంబర్ 3 విడుదల చేసినా అమలుకు నోచుకోవడం లేదన్నారు. రెగ్యులర్ ఉద్యోగికి ఇస్తున్న బేసిక్ వేతనం కాంట్రాక్ట్ ఉద్యోగులకు అందజేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో కనీస సదుపాయాలు కూడా లేవన్నారు. మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు చంద్రమోహన్, అధ్యక్షులు వహిదాబేగం, కార్యదర్శి లీలావతి, విజయవాణి, ఫరీదాబేగం, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా
Published Tue, Dec 24 2013 2:30 AM | Last Updated on Sat, Sep 2 2017 1:53 AM
Advertisement