పార్టీ ముఖ్యనేతలతో భేటీ కానున్న కేసీఆర్ | KCR To meet Party Leaders on Rayala telangana issue | Sakshi
Sakshi News home page

పార్టీ ముఖ్యనేతలతో భేటీ కానున్న కేసీఆర్

Published Tue, Dec 3 2013 1:29 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

పార్టీ ముఖ్యనేతలతో భేటీ కానున్న కేసీఆర్ - Sakshi

పార్టీ ముఖ్యనేతలతో భేటీ కానున్న కేసీఆర్

హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నేడు పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. ఈ రోజు మధ్యాహ్నం కేసీఆర్‌ నివాసంలో ఈ భేటీ జరగనుంది. రాయల తెలంగాణపై జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. రాయల తెలంగాణ అంశంపై ఇప్పటికే కాంగ్రెస్‌ ముఖ్యనేతలు కేసీఆర్‌తో ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. రాయల తెలంగాణను కేసీఆర్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో 'రాయల తెలంగాణ చేస్తామని అనుకుంటే మీ ఖర్మ. మేమైతే ఆ ప్రతిపాదనకు సహకరించపోగా వ్యతిరేకంగానే ఉండాల్సి ఉంటుంది’ అని కేసీఆర్... కాంగ్రెస్ అధిష్టానానికి హెచ్చరికలను పంపారు. కాంగ్రెస్ అధిష్టానానికి సన్నిహితంగా ఉండే ఒక నాయకునికి టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ద్వారా ఈ హెచ్చరికను పంపినట్టుగా పార్టీ వర్గాలు తెలిపాయి.

మరోవైపు రాయల తెలంగాణ ప్రతిపాదన అధికారికంగా వస్తే ఉద్యమించడానికి సిద్ధం కావాలని పార్టీశ్రేణులను కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. మెదక్ జిల్లాలోని ఫాంహౌస్‌లో పార్టీ ముఖ్యులతో ఆయన నిన్న భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాయల తెలంగాణ అనేది పుకార్లు మాత్రమే కావచ్చని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement