
మహ్మద్ ఖదీర్‌బాబు(ఫైల్ ఫొటో)
విజయవాడ కల్చరల్: కథా రచయిత మహ్మద్ ఖదీర్‌బాబు, రచయిత్రి డి.సుజాతాదేవిని 2017 సంవత్సరానికి పెద్దిభొట్ల సుబ్బరామయ్య సాహిత్య స్ఫూర్తి పురస్కారానికి ఎంపిక చేసినట్లు పురస్కారాల నిర్వాహకులు, కథా రచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్య కమిటీ సభ్యురాలు వేలూరి గీతారాణి తెలిపారు. వారు శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఐదు సంవత్సరాలుగా ఈ పురస్కారాలు ప్రదానం చేస్తున్నామన్నారు.
ఖదీర్‌బాబు సామాన్యుని జీవితాలే కథా వస్తువులుగా అనేక కథలు రాశారని, కథా సాహిత్యంలో విశేష కృషి చేస్తున్నారని వివరించారు. ఖదీర్‌తోపాటు బాల సాహిత్యంలో విశేష కృషి చేసిన డి.సుజాతాదేవిని పురస్కారానికి సంయుక్తంగా ఎంపిక చేశామని తెలిపారు. ఈ నెల 13న సాయంత్రం విజయవాడలోని ‘ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ’లో పురస్కారాల సభ జరుగుతుందని వివరించారు. ముఖ్య అతిథిగా కథా రచయిత, కాలమిస్ట్ శ్రీరమణ, అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ, అప్పాజోస్యుల ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అప్పాజోస్యుల సత్యనారాయణ తదితరులు పాల్గొంటారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment